పశ్చిమ బెంగాల్ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

పశ్చిమ బెంగాల్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-01-01 11:51 GMT

పశ్చిమ బెంగాల్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో తొలిసారి వందేభారత్ స్లీపర్ రైలును రైల్వే శాఖ ప్రవేశపెట్టబోతుంది. కోల్ కత్తా - గౌహతిల మధ్య ఈ తొలి స్లీపర్ వందేభారత్ రైలు ప్రారంభంకానుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ రైలు ఛార్జీలను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. తొలి రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు.

త్వరలో అందుబాటులోకి...
సంక్రాంతి పండగలోపే ఈ రైలు పశ్చిమబెంగాల్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రానున్న పదిహేను నుంచి ఇరవై రోజుల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు. త్వరలో ప్రధాని మోదీ ప్రారంభ తేదీ ఎప్పుడు ఉండేది ప్రకటిస్తారని తెలిపారు. వందేభారత్ స్లీపర్ రైలులో కోల్ కత్తా - గౌహతిల మధ్య ప్రయాణానికి ఆరువేల రూపాయలు టిక్కెట్ ధరను నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వైష్ణవ్ చెప్పారు. విమాన ధరల కంటే ఇది తక్కువని, వేగంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చని,త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.


Tags:    

Similar News