నిపా వైరస్ .. బంగ్లాదేశ్ వేరియంట్

కేరళలో నిపా వైరస్ తో ఇద్దరు మృతి చెందారు. దీనిని బంగ్లాదేశ్ వేరియంట్ గా కేరళ ప్రభుత్వం గుర్తించింది.

Update: 2023-09-14 04:39 GMT

కేరళలో నిపా వైరస్ తో ఇద్దరు మృతి చెందారు. దీనిని బంగ్లాదేశ్ వేరియంట్ గా కేరళ ప్రభుత్వం గుర్తించింది. నిపా వైరస్ తో కేరళ ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది. నిపా వైరస్ బారిన పడి మరో ముగ్గురు చికిత్స పొందుతుండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కోజికోడ్ జిల్లాలో పలు గ్రామాలను కంటైన్మైట్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంతాల్లో క్లోరిన్ తో శుభ్రం చేసి ప్రజలను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

చర్యలు...
నిపా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మాస్క్ ధరించడంతో పాటు చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా శానిటైజర్ తో కడుక్కోవాలని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కోజికోడ్ జిల్లాలో ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో అక్కడ మొబైల్ హెల్త్ క్యాంప్‌లను ఏర్పాటు చేసిన కేరళ ఆరోగ్య శాఖ ఐసొలేషన్ గదులను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే వైరస్ సోకిన వారికి సన్నిహితంగా మెగిలిని 100 మందికి పైగా గుర్తించారని కేరళ ఆరోగ్య వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags:    

Similar News