'హ‌లో' క‌లెక్ష‌న్స్‌... దుమ్ము రేపాడుగా...

Update: 2017-12-22 12:37 GMT

అక్కినేని అఖిల్ రీ లాంచ్ సినిమా హ‌లో అంచానాల‌కు త‌గ్గ‌ట్టుగానే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము రేపుతోంది. ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన హ‌లో సినిమాకు యూఎస్‌లో మంచి ప్ర‌మోష‌న్ చేశారు. వారం రోజులకు ముందే అక్క‌డ అఖిల్‌తో పాటు రానా కూడా సినిమాను ప్ర‌మోట్ చేసేందుకు వెళ్లి తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌లుసుకున్నారు.

తెలుగు సినిమాకు ఇటీవ‌ల ఓవ‌ర్సీస్ మార్కెట్ కీల‌కం అని గ్ర‌హించిన హ‌లో యూనిట్ ఓవ‌ర్సీస్‌పై ముందు నుంచి కాన్‌సంట్రేష‌న్ చేసింది. అఖిల్ అక్క‌డ ప్రేక్ష‌కుల‌ను క‌లుసు కోవ‌డంతో పాటు కొన్ని చోట్ల లైవ్ పెర్పామెన్సులు కూడా చేశాడు. దీంతో సినిమాకు మంచి ప్ర‌చారం రావ‌డంతో భారీ ఓపెనింగ్స్ ద‌క్కాయి.

భారీ ఎత్తున హ‌లో ప్రీమియ‌ర్లు ప్లాన్ చేయ‌డంతో హ‌లోకు కేవ‌లం ప్రీమియ‌ర్ల‌తోనే 133 లొకేషన్లలో కలిపి ఈ సినిమాకు 1.87 లక్షల డాలర్లు వసూలయ్యాయి. ఇది అఖిల్‌కు ఈ రేంజ్‌లో అక్క‌డ వ‌సూళ్లు రావ‌డం నిజంగానే గొప్ప విష‌యం. ఇక వీకెండ్‌తో పాటు అక్క‌డ క్రిస్మ‌స్ సెల‌వులు కూడా క‌లిసి రావ‌డంతో హ‌లో వ‌సూళ్ల దుమ్ము రేప‌డం ఖాయ‌మే.

Similar News