హీరోలకు వార్నింగ్

Update: 2018-02-05 10:00 GMT

ఇండస్ట్రీలో చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు తమ సినిమాలు ఏ హీరో సినిమాల్తో క్లాష్ కాకుండా చూసుకుంటూ రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఈ మధ్యన ఎక్కువ సినిమాలు రావడం.. ఆ సినిమాలకు సరైన రిలీజ్ డేట్స్ లేకపోవడంతో చాలామంది హీరోలు తమ తమ సినిమాల ను వేరే హీరోల సినిమాలకు పోటీగా బాక్సాఫీసు బరిలోకి దించడానికి వెనుకాడని పరిస్థితుల్లో ఉన్నారు. ఇకపోతే గత కొంత కలం నుండి మెగా హీరోలు టాలీవుడ్ లో టాప్ రేంజ్ లోను అలాగే... చిన్నగా పైకి రావడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. మెగా వృక్షం చిరు నుండి వచ్చిన ఈ హీరోలంతా తమ తమ స్వయం కృషితో పైకి ఎదగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు తొలిసారి ఇద్దరు మెగా హీరోలు తమ సినిమాల విడుదల విషయంలో పోటీ పడుతున్నారు. అందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ సినిమాతో ఫిబ్రవరి 9 న వస్తుండగా... మెగా వారసుడు వరుణ్ తేజ్ తొలిప్రేమతో ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఇలా మెగా హీరోలు ఒకేసారి బాక్సాఫీసు వద్ద తన్నుకోవడం అల్లు అర్జున్ కి నచ్చలేదట. అందుకే మెగా హెరోలందరితో సమావేశం నిర్వహించి ఇప్పుడు ఇలా పోటీ పడితే పడ్డారు గాని,.. ఇంకెప్పుడు ఇలాంటివి జరక్కుండా జాగ్రత్త పడదామని చెప్పాలని ఒక మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట.

ఎందుకంటే ఇలా ఒకే ఫ్యామిలీకి సంబందించిన హీరోలు పోటీ పడడం వలన విభేదాలు తలెత్తే అవకాశం ఉందని అల్లు అర్జున్ భావంగా కనబడుతుంది. మరి ఇలా పోటీపడటం వలన మెగా అభిమానులు కూడా చీలిపోయే అవకాశం ఉందనేది ఆ మెగా హీరో ఉద్దేశ్యం. అందుకే మెగా హీరోలు తమ సినిమాల విడుదల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.... తమ సినిమాల రిలీజ్ విషయంలో రెండుమూడు వారాల గ్యాప్ పాటించాలనే విషయాన్నీ ఆ మెగా మీటింగ్ లో అల్లు అర్జున్ స్పష్టం చేయబోతున్నాడట.

Similar News