టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఇప్పుడు ఎంత సంచలనమో అందరికి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రిటీస్ నోటీసులు అందుకుని సిట్ ముందుకు విచారణకు హాజరయ్యారు కూడాను. మరి పలువురు సెలబ్రిటీస్ ని సిట్ అధికారులు విచారణ చేపట్టినప్పుడు ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులను ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ లు కూడా చేశారు. ఈ డ్రగ్స్ కేసులో ముఖ్యంగా పోలీసులు హీరోయిన్ కాజల్ మేనేజర్ రోనీ ని కూడా అరెస్ట్ చెయ్యడంతో ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా షాక్ కి గురైయ్యారు. ఇక కాజల్ అయితే తనకి అతనికి సంబంధం లేదని ప్రస్తుతానికి తన విషయాలన్నీ తన పేరెంట్స్ చూసుకుంటున్నారని మీడియాకి వివరణ కూడా ఇచ్చింది.
అయితే ఇప్పుడు ఇదే విషయం మీద వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఒక హీరోయిన్ కొన్ని సలహాలు పడేస్తుంది. ఆమె ఎవరో కాదు కుమారి 21 ఎఫ్ తో హాట్ హీరోయిన్ గా పేరు సంపాదించిన హేబా పటేల్. హెబ్బా ఇండస్ట్రీలోని మిగతా హీరోయిన్స్ ని అలెర్ట్ చేసే విధంగా కొన్ని సలహాలే కాదు కామెంట్స్ కూడా చేస్తుంది. అసలు డ్రగ్స్ వాడకం చాలా ప్రమాదకరమని..... అలాగే ఎవరైనా హీరోయిన్ మేనేజర్లను ఎంపిక చేసుకునే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిదని చెబుతుంది.
అసలు డ్రగ్స్ విషయంలో హీరోయిన్ల మేనేజర్లపై ఆరోపణలు రావడంతో.... మేనేజర్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తుంది. అసలైతే మేనేజర్లు ని పెట్టుకోకుండా తమ తమ సొంత వారికే తమ పనులు అప్పజెప్పాలని.... ఒకవేళ తప్పుటడుగులు వేస్తే గనక చాలా నష్టపోవాల్సి వస్తుందని హెబ్బా పటేల్ చెబుతుంది. నిజంగా హెబ్బా చెప్పింది కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఆమె చెప్పింది అందరు హీరోయిన్స్ ఒంటబట్టించుకుంటే... ఎటువంటి ఇబ్బందులు కలగవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.