హీరో మారాడు.. మరి ప్రేక్షకుడు మారుతాడా...!!

Update: 2017-07-08 12:00 GMT

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలంతా కొత్తగా ట్రై చేస్తున్నారు. ఎపుడు మూడు ఫైట్లు.. ఆరు డ్యూయెట్ల మోనాటనీ నుంచి టాలీవుడ్ ఇప్పుడిపుడే బయటపడుతోంది. ఎప్పుడూ కూడా ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లు, ఖరీదైన కాస్ట్యూమ్స్, ఫారెన్ లొకేషన్స్, డ్యూయెట్ సాంగ్స్ లేకుండా కాల్షీట్లు ఇవ్వడం కుదరదంటూ మొండికేసే టాలీవుడ్ హీరోలు ఇప్పుడు క్రమంగా మారిపోతున్నారు. కొత్తగా ఏదన్న ట్రై చెయ్యాలనే భావనలోకి వెళుతున్నారు.

టాలీవుడ్ లో ముగ్గురు హీరోలు ఇలా విభిన్నమైన కథలను ఎంచుకుని మిగతా హీరోలకు కూడా మార్గదర్శకులుగా మారిపోనున్నారు. వారెవరో మీకీపాటికే స్ఫురణకు వచ్చేసి ఉంటుంది. వారెవరో కాదు ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మరొకరు రామ్ చరణ్ తేజ్, ఇంకొకరు రవితేజ. ఎన్టీఆర్, బాబీ డైరెక్షన్ లో తన అన్న కళ్యాణ్ రామ్ భారీగా నిర్మిస్తున్న 'జై లవ కుశ'లో మూడు పాత్రల్లో మెరిపించనున్నాడు. మూడు పాత్రలకే విభిన్నమా అనుకోకండి. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్ వున్న విలన్ పాత్ర. మరి స్టార్ హీరో విలన్ గా చెయ్యడమంటే అది మామూలు సాహసం కాదు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఎన్టీఆర్ 'జై' పాత్రకి నత్తి ఉంటుంది.

అలాగే సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ 'రంగస్థలం 1985 ' మూవీలో చెవిటివానిగా నటిస్తున్నాడు. మరి చెవిటివానిగా నటించడానికి ఒప్పుకుని రామ్ చరణ్ మంచి సాహాసమే చేసాడు. ఇకపోతే రవితేజ, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో గుడ్డివాడిగా క్లాసికల్ రోల్‌లో కనిపించ బోతున్నాడు. మరి ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలు ఇలా కొత్తదనం కోరుకుంటూ వెళుతుండడం శుభపరిణామమే అంటున్నారు. అయితే హీరోల ఆలోచనలు మారి వారు కొత్తగా ట్రై చేయడాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిమీదే ఇప్పుడు కాస్త సస్పెన్సు మొదలైంది.

Similar News