హీరో ని వెనకేసుకొస్తున్న డైరెక్టర్!

Update: 2018-03-09 05:24 GMT

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి హిట్స్ తో యమా జోష్ మీదున్న విజయ్ దేవరకొండ అంటే యూత్ లో పిచ్చ క్రేజ్ ఉంది. అయితే ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి విజయ్ మొదటి సినిమా దర్శకుడు, నిర్మాత చాలానే ప్లాన్ చేశారు. అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్న విజయ్ క్రేజ్ ని ఏ మంత్రం వేశావే సినిమా విడుదలకు వాడాలని ప్లాన్ చేశారు. అయితే విజయ్ కి ఏ మాత్రం క్రేజ్ లేని టైం లో నటించిన సినిమా కావడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎటువంటి ఇంట్రెస్ట్ చూపడంలేదు. ఈలోపు రెండు హిట్స్ తో విజయ్ కి గర్వం పెరిగిపోయిందని టాక్ బయటికి వచ్చింది.

అయితే అదంతా కేవలం ఒట్టి పుకారు అంటున్నాడు శ్రీధర్ మర్రి. ఏ మంత్రం వేశావే ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా దర్శకుడు శ్రీధర్ మర్రి మాట్లాడుతూ తనకి సినిమాల మీదున్న ఇంట్రెస్ట్ తో తాను చేసే సాఫ్ట్ వెర్ ఉద్యోగం వదిలేసి మరి సినిమా చేశానని.... పరిశ్రమలో డెబ్యూ డైరెక్టర్ ని నమ్మి సినిమాలు చేసే నిర్మాతలు ఉండరు గనక ఈ సినిమాని తానే నిర్మించానని చెప్పిన శ్రీధర్ మర్రి విజయ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడంతో.. విజయ్ కి నాకు మధ్యన యేవో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది.

కానీ అందులో ఎటువంటి నిజం లేదు. విజయ్ దేవరకొండ తన సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్లనే ఈ సినిమా ప్రమోషన్స్ కి రాలేకపోయాడని శ్రీధర్ మర్రి... విజయ్ దేవరకొండ గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. నిజానికి విజయ్ కి తనకి ఎటువంటి మనస్పర్థలు లేవని శ్రీధర్ మర్రి క్లారిటీ ఇచ్చేసాడు. మరి తన సినిమాని హీరో ప్రమోట్ చెయ్యకపోయినా ఆ హీరో గురించి చిన్న బ్యాడ్ వర్డ్ కూడా మాటాడకుండా శ్రీధర్ మర్రి తన హుందాతనాన్ని చూపించాడు. కానీ విజయ్ తలచుకుంటే... ఈ సినిమాని ఎలాగైనా అంటే ఇంటర్నెట్ సహాయంతో ప్రమోట్ చెయ్యొచ్చు. కానీ లేదు.

Similar News