నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సవ్యసాచి' చిత్రం అతి త్వరలోనే సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు చందు, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించే ప్రయత్నాలు మొదలెట్టాడనే టాక్ వుంది. మరి రెండు భాషల్లోనూ తెరకెక్కుతున్న ఈ 'సవ్యసాచి' కోసం తమిళ నటుడు మాధవన్ ని స్పెషల్ కేరెక్టర్ కోసం తీసుకుంటున్నారట. తెలుగు కంటే ఎక్కువగా మాధవన్ కి తమిళ భాషలో ఎక్కువ క్రేజ్ ఉండడంతో తమిళ వెర్షన్ 'సవ్యసాచి'కి మంచి హైప్ క్రియేట్ అయ్యి అటు మార్కెట్ పరంగాను.. ఇటు శాటిలైట్ పరంగా ను క్యాష్ చేసుకోవచ్చనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇక 'సవ్యసాచి' లో స్పెషల్ కేరెక్టర్ చేస్తున్న మాధవన్ కి ఏకంగా 4 కోట్లకు ఆఫర్ చేశారనే టాక్ నడుస్తుంది.మరి మాధవన్ కి నాలుగు కోట్లు ఇస్తే మాధవన్ తో సమానంగా అయినా ఇంకొద్దిగా ఎక్కువగా అయినా 'సవ్యసాచి' హీరో నాగ చైతన్య కి ఇవ్వాలి. మరి లెక్కప్రకారం స్పెషల్ కేరెక్టర్ కి అంతిస్తే.. హీరోకి దానికి ఏమాత్రం తగ్గకూడదు. కానీ హీరో నాగ చైతన్య కి అంత మార్కెట్ అయితే లేదు. మరి ఈలెక్కన చైతూకు నాలుగు కోట్లు ఇవ్వడం అనేది అవమానంగానే ప్రచారం మొదలైంది. చూద్దాం మైత్రీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'సవ్యసాచి' కి ఫైనల్ గా చైతు రెమ్యునరేషన్ ఎంతో అనేది.