హీరో ఇస్తున్న బంపర్ ఆఫర్ ని కాజల్ ఒప్పుకుంటుందా?

Update: 2017-09-17 14:00 GMT

రవితేజ - కాజల్ అగర్వాల్ కలయికలో రెండు అట్టర్ ప్లాప్ సినిమాలు తెరకెక్కాయి. వీరిద్దరూ కలిసి వీర, సారొచ్చారు లాంటి సినిమాలు చేశారు. అయితే ఈ రెండు సినిమాల్లో కాజల్ అగర్వాల్, రవితేజ సరసన చేసిన వీర సినిమాలో పక్కా మాస్ గా కనిపిస్తే… సారొచ్చారు సినిమాలో చాలా క్లాస్ గా కనిపించింది. అయితే ఇప్పుడు ఈ బుట్టబొమ్మను మరోసారి తన సినిమాలోకి తీసుకోవాలని చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ.

రవితేజ త్వరలోనే ప్లాప్ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్దమైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు శ్రీను వైట్లకి హీరో రవితేజకి మధ్య కథా చర్చలు పూర్తయినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్న శ్రీను వైట్ల ఈ సినిమాలో రవితేజ కి జోడిగా కాజల్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో కాస్త బిజీగానే ఉన్న కాజల్.. మాస్ రాజా రవితేజ ఇచ్చిన అవకాశానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు మొదలుఅయ్యి, ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందనే విషయం ఇంకా క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం రవితేజ చేతిలో 2 సినిమాలున్నాయి. వీటిలో ఒకటి రాజా ది గ్రేట్ సినిమా. ఇక ఈ సినిమా మరో నెలరోజుల్లో ఓ కొలిక్కి రాబోతోంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే వైట్ల సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. ఇక రవితేజ చేతిలో ఉన్న మరో సినిమా టచ్ చేసి చూడు. ఈ సినిమాని ప్రస్తతం రవితేజ హోల్డ్ లో పెట్టినట్లుగా తెలుస్తుంది. వరుస ఫ్లాపులిచ్చిన శ్రీనువైట్ల, రవితేజ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు. చూద్దాం ఈ సినిమా సెట్స్ మీదకెళ్లాక ఈ సినిమా ముచ్చట్లు మాట్లాడుకుందామంటున్నారు కొందరు.

Similar News