హిట్ టాక్ వచ్చిన సినిమాలకి కలెక్షన్స్ ఎందుకు రావట్లేదు

Update: 2017-12-13 05:53 GMT

వీకెండ్ వస్తే సినిమాలా హడావిడి మొదలవుతుంది. పని చేసేవాడు, ఉద్యోగం చేసేవాడు, వ్యాపారం చేసేవాడు అని తేడా లేకుండా వీకెండ్ వస్తే సినిమా థియేటర్స్ పై వాలిపోతారు. వారం రోజుల పని ఒత్తిడి నుండి బయటపడేందుకు ప్రశాంతత కోసం అందరూ ఎంచుకునే మార్గం సినిమా.

వీకెండ్ స్టార్ట్ అయింది అంటే చాలు థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెల కుంటుంది. సినిమా టాక్ తో పని లేకుండా, సినిమా హీరోతో పని లేకుండా సినిమా అయితే చాలు అన్నట్లుగా థియేటర్స్ కి వెళ్లిపోతుంటుంటారు జనాలు. కానీ గత కొన్ని నెలల నుండి సినిమా హాల్స్ అన్ని జనాలు లేక విలవిలాడిపోతున్నాయి.

యావరేజ్ లేదా యబో యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకి కూడా కలెక్షన్స్ రావట్లేదంట. ట్రేడ్ వర్గాలు ఓ అంచనా వేస్తె.. రిపోర్ట్స్ మాత్రం వేరేలా వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుంతుంది అని ఆరా తీస్తే చలికాలం అని తెలిసింది. గతంలో పోల్చుకుంటే ఈసారి చలి బాగా ఎక్కువగా ఉందని.. సాయంత్రానికి, మధ్యాహ్నానికి తేడా లేకుండా చలి వేస్తుందని అందుకే జనాలు సినిమా హాల్స్ రావటానికి ఇష్టపడట్లేదని తెలుస్తుంది. దీంతో సినిమాలకి కలెక్షన్స్ లేక బాక్స్ ఆఫీస్ గొల్లుమంటోంది.

Similar News