హలోని వెంటాడుతున్న సమస్య ఏంటి?

Update: 2017-12-13 11:00 GMT

హలో సినిమా కోసం అక్కినేని ఫామిలీ మొత్తం ఎదురుచూస్తుంది. అఖిల్ కెరియర్ స్టార్టింగ్ లోనే ఎదురు దెబ్బ తగిలింది. అఖిల్ రెండో సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని నాగార్జున చేస్తున్న ప్రొమోషన్స్ చూస్తేనే అర్ధం అవుతుంది. అయితే సోషల్ మీడియాలో హలో కథపై ఓ నెగటివ్ టాక్ సినిమాపై ఎఫెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే.... ఇది ఓ ఇంగ్లీష్ మూవీ నుండి కాపీ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఒక సెల్ మాఫియా తరహాలో తెరకెక్కిన 'సెల్యులార్' అనే ఇంగ్లీష్ సినిమా ఆధారంగా చేసుకొని దర్శకుడు విక్రమ్ కుమార్ కథ రాసుకున్నాడు అనే రూమర్స్ వస్తున్నాయి.

2005 లో వచ్చిన ఈ సినిమాలో కిడ్నాప్ అయిన ఒక వృద్ధురాలు ఒక యువకునికి ఎమర్జెన్సీ కాల్ చేస్తుంది. అలానే హలో ట్రైలర్ చూస్తే అఖిల్ హీరోయిన్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. మరి ఆమె కూడా 'సెల్యులార్' సినిమాలాగా ముఠాల చేతిలో కిడ్నాప్ అవుతుందా మరి?. ఇక ట్రైలర్ లో చూపించినట్టుగా ట్రక్ లో చాలా మొబైల్స్ కిందపడటం చూస్తుంటే.. సదరు హాలీవుడ్ సినిమాను గుర్తు చేస్తున్నాయని అంటున్నారు.

మరి ఇదంతా నిజమో కాదో తెలియాలంటే సినిమా డిసెంబర్ 22 దాకా వెయిట్ చేయక తప్పదు. హలో సినిమా ఎలా ఉంటుందో ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఒక నిర్దారణకు రాకూడదనే చెప్పాలి.

Similar News