హలో సాంగ్ ఛీటింగా?

Update: 2017-12-07 04:00 GMT

అక్కినేని అఖిల్ ని తండ్రి అక్కినేని నాగార్జున ఛీటింగ్ చేసాడంట. అయ్యో అదేమిటి కొడుకుని తండ్రి ఛీటింగ్ చెయ్యడమేమిటా అని అనుకుంటున్నారా? అదంతా కేవలం సరదాకి లెండి. లేకపోతె తండ్రి కొడుకుని చీట్ చెయ్యడమేమిటి. ఇంతకీ విషయం ఏమిటంటే.. అఖిల్, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న హలో సినిమా సర్ప్రైజ్ మీకోసం అంటూ అఖిల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కి నాగార్జున సమాధానమిస్తూ 'నాకు చెప్పకుండానా.? ఇదేనా ఆ సాంగ్‌.... అంటూ హలో సాంగ్ ని యూట్యూబ్ లో పోస్ట్ చేసాడు.

అయ్యో డాడ్ ఛీటింగ్ అంటూ అఖిల్ తండ్రిని ఆటపట్టించడం తోపాటు నాగార్జున విడుదల చేసిన ఆ హలో సాంగ్ కూడా అదరగొట్టేస్తుంది. హలో సినిమాలో, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ పెళ్ళిలో అఖిల్ అదిరిపోయే డాన్స్ తో.. క్యూట్ లుక్స్ తో హీరోయిన్ కళ్యాణి.. అందమైన లుక్స్ తో రమ్యకృష్ణ, జగపతి బాబు కనబడుతున్నారు. అఖిల్ అదిరిపోయే స్టెప్స్ కి అదిరిపోయే పెళ్లి సెట్ ఆకట్టుకుంటుంది. ఆ సాంగ్ చిత్రీకరణకు బాగానే ఖర్చు పెట్టారనే విషయం ఆ సెట్ చూస్తుంటే అర్ధమవవుతుంది.

మరి హలో టీజర్, ట్రైలర్, సాంగ్ ఇలా అన్నీ.... సినిమా మీద మంచి అంచనాలను పెంచేస్తున్నాయి. మరి రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా పాటలు ఈ నెల 10 న వైజాగ్ లో విడుదల చేస్తుండగా సినిమా ఈ నెల 22 న విడుదలకు సిద్దమవుతుంది.

Similar News