అఖిల్ - కళ్యాణి జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో మూవీ గత శుక్రవారమే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అయితే హిట్ అని క్రిటిక్స్ కూడా యునానమస్ గా ఓటేసినా హలో కలెక్షన్స్ మాత్రం ఆశించినంతగా లేవు. మొదటి మూడు రోజులు కలెక్షన్స్ పర్వాలేదనిపించినప్పటికీ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని నాగార్జున భారీ బడ్జెట్ తో నిర్మించాడు. అఖిల్ డిజాస్టర్ హలో మీద ఏమాత్రం పడలేదనడానికి హలో మూవీ కి జరిగిన బిజినెస్ ఉదాహరణగా మిగిలింది. కాకపోతే ఈ వారం ముగిసేసరికి హలో సినిమా పెట్టిన బడ్జెట్ లో కేవలం సగం మాత్రమే కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఏరియాల వారీగా హలో కలెక్షన్స్ మీ కోసం.
ఏరియా ఫస్ట్ వీక్ షేర్ (కోట్లలో)
నైజాం 4.25
సీడెడ్ 1.77
నెల్లూరు 0.44
కృష్ణ 0.82
గుంటూరు 1.౧౦
వైజాగ్ 1.27
ఈస్ట్ గోదావరి 0.68
వెస్ట్ గోదావరి 0.57
1ST వీక్ ఏపీ & టీఎస్ షేర్ 10.90
కర్ణాటక 1.20
యుఎస్ఏ, రో & రాయ్ 3.10
1st వీక్ వరల్డ్ వైడ్ షేర్ 15.20