'హలో' మరో మనమా?

Update: 2017-11-28 09:00 GMT

అఖిల్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్ కు ఆ చిత్ర ఫలితం నిరాశ పరిచింది. ఆ తరువాత గ్యాప్ తీసుకొని అతను విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘హలో’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని టీజర్, పోస్టర్ లు ఈ చిత్రం పై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఒక వార్త నెట్ లో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. అఖిల్ నటిస్తున్న ‘హలో’ చిత్రంలో అక్కినేని నాగార్జున , అమల , సమంతలు తళుక్కున మెరవనున్నారట.. ఈ చిత్రంలో అఖిల్ ను వారు ‘హలో అవినాష్’ అంటూ పలకరించబోతున్నారట..

అఖిల్ చిత్రంలోని ఒక పాటలో అఖిల్ తో కలిసి నాగార్జున స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే.. మరోసారి వీరిద్దరూ తెరపై కనిపిస్తే అక్కినేని అభిమానులకు పండగే అని అనడంలో సందేహం లేదు. ఇక విక్రమ్ దర్శత్వంలో 'మనం' సినిమాలో మెరిసిన అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు మరోమారు అఖిల్ కోసం 'హలో' లో కనబడనున్నారన్నమాట. మరి 'హలో' కూడామరో 'మనం' సినిమా కానుందా. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మిస్తున్న ‘హలో’ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. కళ్యాణి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది

Similar News