హలో.. తెర వెనక కథ

Update: 2017-12-17 07:56 GMT

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ మొదలు పెట్టిన సినిమా చాలా రోజులు షూటింగ్ జరుపుకున్నాకా ఆ సినిమా టైటిల్ ని బయటికి వదిలారు. చాలా రోజుల పాటు టైటిల్ ఎనౌన్స్ చెయ్యకుండా బాగా సస్పెన్సు మైంటైన్ చేశారు నాగార్జున అండ్ విక్రమ్ కుమార్ లు. ఎట్టకేలకు హలో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ ని ఇలా ప్రకటించిన వెంటనే అలా అందరికీ అతితక్కువ సమయంలోనే కనెక్ట్ అయిపోయింది. అయితే ఇంతకీ అఖిల్ రెండో సినిమాకు ఆ హలో టైటిల్ పెట్టింది ఎవరు అనే విషయంపై అఖిల్ తండ్రి, హలో నిర్మాత... నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.

అఖిల్ సినిమా డిజాస్టర్ తర్వాత వస్తున్నా ఈ సినిమాకు టైటిల్ పెట్టడానికి చాలా కష్టపడ్డాం అని.... దాదాపు 3 నెలల పాటు సుమారు 50 టైటిల్స్ చర్చించినా తెగని ఈ టైటిల్ వ్యవహారం.... ఒకరోజు పొద్దున్నే నాగ్ ఎక్సర్ సైజ్ చేస్తుంటే ఓ మెరుపులా హలో అనే టైటిల్ తట్టడం.... వెంటనే నాగ్ మేనకోడలు, అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకుంటున్న సుప్రియకు ఫోన్ చేసి ఆ టైటిల్ రిజిస్టర్ చేయించమని నాగ్ చెప్పాడట. ఆ తర్వాత నాగార్జున, దర్శకుడు విక్రమ్ కుమార్ దగ్గరకెళ్లి ఈ టైటిల్ గురించి చెప్పడము.... విక్రమ్ చాలా బాగుందని చెప్పడంతో.. అఖిల్ రెండో సినిమాకి ఇలా హలో టైటిల్ పెట్టమంటూ.... హలో టైటిల్ వెనక జరిగిన తతంగాన్ని బయటపెట్టాడు నాగార్జున.

ఇకపోతే ఈ సినిమా కథకు, ఈ హలో టైటిల్ కు చాలా సంబంధం ఉందని.. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ టైటిల్ తో కనెక్ట్ అవుతారని నాగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అఖిల్ - కళ్యాణి జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 22న రిలీజ్ కాబోతోంది.

Similar News