హమ్మా... ఇప్పటికి ఫిక్స్ అయ్యింది

Update: 2017-08-15 11:58 GMT

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే సినిమాపై బాహుబలి రిలీజ్ కి ముందే క్లారిటీ వచ్చింది. సుజిత్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్ నిర్మాణంలో ప్రభాస్ సాహో చిత్రాన్ని బాహుబలి విడుదలకు ముందే ఎనౌన్స్ చేసాడు. సాహో సినిమా ని ఎనౌన్స్ చెయ్యడమే కాదు ఆ సినిమా టీజర్ తో కూడా వచ్చేసి అభిమానులకు షో టైం అంటూ షాకిచ్చేసాడు.అదిగొ... అప్పటినుండి ప్రభాస్ పక్కన చెయ్యబోయే హీరోయిన్ విషయంలో వచ్చిన వార్తలు మరే సినిమా హీరో కి వచ్చి ఉండవు . ప్రభాస్ పక్కన సాహోలో ఈ హీరోయిన్ ఫైనల్ అంటే ఆ హీరోయిన్ ఫైనల్ అంటూ వచ్చిన గాసిప్స్ కి లెక్కే లేదు.

ముందుగా బాలీవడ్ భామ అన్నారు. కాదు కాదు బాహుబలి భామ అనుష్కనే సాహోలో ప్రభాస్ పక్కన అన్నారు. కాదు అంటూ మళ్ళీ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ అన్నారు. లాస్ట్ కి ఫైనల్ గా శ్రద్ద కపూర్ సాహో చిత్రంలో ప్రభాస్ పక్కన ఫైనల్ అయ్యింది. ఈ విషయాన్నీ యూవీ క్రియేషన్స్ వారు అధికారికంగా ప్రకటించారు. సాహో ఫ్యామిలీ బ్యూటిఫుల్ శ్రద్దా కపూర్ కు స్వాగతం పలుకుతున్నాం అంటూ ట్వీట్ చేసింది. ముందు అనుకున్నట్టుగానే సాహో కోసం బాలీవుడ్ భామనే దింపారు.

ఇక సాహో చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు . మరీమూడు భాషల్లో సినిమా అంటే హీరోయిన్ కి కూడా గట్టిగానే సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మూడు భాషల్లో ప్రమోషన్ కార్యక్రమం గట్రా ఉంటుంది కాబట్టి శ్రద్ధకి కూడా సాహో చిత్ర యూనిట్ భారీగానే సమర్పించారని టాక్ ఉంది. శ్రద్ద కపూర్ సాహో లో నటిస్తున్నందుకు గాను ఆమెకి ఏకంగా 8 కోట్లు పారితోషకం ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Similar News