హమ్మయ్య ఇన్నాళ్ళకి కనికరించింది

Update: 2017-10-03 16:42 GMT

కేరళ నటి భావన కిడ్నాప్ కేసులో 85 రోజుల నుండి శిక్ష అనుభవిస్తున్న మలయాళ హీరో దిలీప్ కుమార్ కి ఊరట కలిగింది. ఎప్పటినుండో తనకి బెయిల్ కావాలని కోర్టుకి పిటిషన్స్ వేసి వేసి ఆయాసమొచ్చినా చివరికి కోర్టు దిలీప్ కి బెయిల్ ప్రసాదించింది. అది కూడా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. గత ఫిబ్రవరిలో భావన సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా... కారులో ఆమెపై కొంతమంది దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడడమే కాక ఆమెని కిడ్నాప్ చేయబోయి పోలీసులకు చిక్కిన వారు తమ వెనుక ఉన్నది నటుడు దిలీప్ అని చెప్పగా పోలీస్ లు ఆధారాలతో సహా దిలీప్ ని అరెస్ట్ చేసి కష్టడికి తరలించిన విషయం తెలిసిందే.

జూలై 10న దిలీప్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన పై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో చాలాసార్లు బెయిల్‌ కోసం దిలీప్‌ కోర్టుని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. అప్పట్లో దిలీప్ కి బెయిల్‌ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేయడమే కాకుండా దర్యాప్తును కూడా ప్రభావితం చేసే అవకాశముందని ప్రాసిక్యూషన్‌ వాదనతో కోర్టు ఏకీభవించి దిలీప్ కి బెయిల్ ఇవ్వకుండా ఏడిపించింది. తాజాగా బెయిల్‌ కోసం దిలీప్‌ చేసుకున్న అభ్యర్థనను కోర్టు అంగీకరించి దిలీప్ కి బెయిల్ ఇచ్చింది.

ఇకపోతే దిలీప్ జైలు కి వెళ్ళకముందు ఆయన నటించిన చిత్రం పూర్తిగా పూర్తి కాకపోయినా కొన్ని మెరుగులు దిద్ది రామలీలా చిత్రాన్ని గత శుక్రవారమే విడుదల చేశారు మేకర్స్. ఇక గత శుక్రవారమే విడుదలై పాజిటివ్ టాక్ అంటే.... దిలీప్ ఇంట్రెస్ట్ తో ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ అందిస్తున్నారు మలయాళీలు.

Similar News