ఒకే రోజు రెండు పెద్ద హీరోల చిత్రాలు విడుదలైతే ఆ ప్రభావం ఆ చిత్రాల కలెక్షన్ల పై కచ్చితంగా ఉంటుంది. అందుకే విడుదల తేదీలను బట్టి కూడా చిత్ర కలెక్షన్లు మారుతుంటాయి.. ఈ మధ్యన కొని చిత్రాలు సినిమా ఓపెనింగ్ రోజే... చిత్ర విడుదల తేదీని ప్రకటించేస్తున్నాయి.
తాజాగా ఒకే డేట్ కోసం ముగ్గురు పెద్ద హీరోలు పోటీ పడ్డారు.. వారెవరో కాదు రజినీకాంత్ , అల్లు అర్జున్ , మహేష్ బాబు.. వారు పోటీపడనున్న తేదీ ఏప్రిల్ 27, 2018. మొదట ఏప్రిల్ 27న ‘నా పేరు సూర్య’ , ‘భరత్ అను నేను’ చిత్రాలు విడుదలను ఖరారు చేసుకోగా… ఉన్నట్లుండి రజినీకాంత్ రోబో 2.0 కూడా జనవరి నుండి ఏప్రిల్ 27కు వచ్చేయడంతో తెలుగు నిర్మాతలు కాస్త కంగారు పడ్డారు.. ఆ కంగారు మామూలు కంగారు కాదు... ఆ సినిమా నిర్మాతలు ఏకంగా 2.0 నిర్మాతలు లైకా మీద సోషల్ మీడియాలో మాటల దాడి చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2.0 చిత్ర విడుదల 27న కాదంటున్నారు.
ప్రతీ సంవత్సరం రజినీకాంత్ నిర్వహించే అభిమానుల సమావేశం ఈ ఏడాది కూడా చెన్నైలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సమావేశాల్లో రజిని 2.0 చిత్రం వాయిదా పడడంపై మాట్లాడుతూ.... విఎఫ్ఎక్స్ పని ఆలస్యం అయ్యిందని.. విజువల్ ఎఫెక్ట్స్ కు తగ్గట్టుగా ఎ.ఆర్.రహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిచడంవల్లే సినిమా ఆలస్యమైందని రజిని చెప్పారు. అలాగే 2.0 చిత్రాన్ని తమిళ కొత్త సంవత్సరం అయిన ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు రజినీకాంత్ ఈ సమావేశంలో తెలిపాడు. దాంతో ఈ రెండు తెలుగు చిత్రాల నిర్మాతలకు కాస్త ఉపశమనం లభించిందని చెప్పాలి