హనుకి శర్వానే దిక్కు

Update: 2017-10-30 10:00 GMT

'అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాద' వంటి విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి... నితిన్ తో మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో 'లై' సినిమాని తెరకెక్కించాడు. 'లై' సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ బిసి సెంటర్స్...అలాగే ఒక మాస్ సినిమా ముందు నిలవలేక చేతులెత్తేసింది. నితిన్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ఇచ్చాడు హను రాఘవపూడి. తొలి రెండు చిత్రాలతో పెట్టిన పెట్టుబడితో పాటే లాభాల పంట పండించిన హను 'లై' తో మాత్రం నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చాడు. ఇక 'కృష్ణగాడి వీరప్రేమ గాద' విడుదలై సక్సెస్ సాధించాక హనుతో అఖిల్ ఒక సినిమా చేస్తాడన్నారు.

కానీ అఖిల్ తన మొదటి సినిమా దెబ్బకి రెండో సినిమాని కాస్త సీనియర్ డైరెక్టర్ అయిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మొదలెట్టాడు. ఇక 'లై' ప్లాప్ తో హనుతో సినిమాకి అఖిల్ కూడా ఆలోచనలో పడ్డాడంటున్నారు. అలాగే నాని కూడా హను రాఘవపూడి కి 'కృష్ణగాడి....' టైం లో మరో సినిమా చేద్దామని మాటిచ్చాడు. కానీ నాని ఇప్పుడు వరుసబెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు గాని హను సినిమాపై క్లారిటీ ఇవ్వడంలేదు. అయితే హను కి ఇప్పుడొక యంగ్ హీరో అవకాశమిచ్చాడంటున్నారు. అతనెవరో కాదు 'మహానుభావుడు' హిట్ తో హ్యాపీ మూడ్ లో ఉన్న శర్వానంద్.. 'మహానుభావుడు' తర్వాత సుధీర్ వర్మ సినిమాకి కమిట్ అయ్యాడు శర్వానంద్. అలాగే బాహుబలి నిర్మతలు శర్వానంద్ ఒక సినిమా చెయ్యాల్సి ఉంది.

కానీ ఇప్పుడు 'బాహుబలి' నిర్మాతల సినిమా క్యాన్సిల్ కావడంతోనే శర్వానంద్ హనుతో కమిట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 'బాహుబలి' నిర్మాతల సినిమా డేట్స్ ని శర్వానంద్... హను సినిమాకి షిఫ్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి హనుకి శర్వా అవకాశం ఇచ్చాడా? లేదా అనేది మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News