మహేష్ బాబు తాజా చిత్రం అయిన స్పైడర్ దసరా కనుకనగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెగటివ్ టాక్ తో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా వల్ల చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారనే ప్రచారం మొదలైంది. మరి స్పైడర్ తో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవడంతోపాటే ఇప్పుడు ఈ సినిమా ఒక వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే ఈ సినిమా లో విలన్ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాటి కాపర్లని కించపరిచే విధంగా చూపించారని ఆ సంఘం ప్రతినిధులు ఆందోళనకి రెడీ అయ్యారు.
అలా స్పైడర్ సినిమాలో కాటికాపర్లని కించ పరిచే విధంగా ఉన్న సన్నివేశాలని తక్షణం తొలగించాలని రాష్ట్ర కాటి కాపర్ల సంఘం అధ్యక్షులు శీలం సత్యనారాయణ డిమాండ్ చేసారు.వీరంతా హైదరాబాద్ రామంతపూర్ హిందూ స్మశాన వాటికలో సమావేశం అయ్యారు. అసలు శ్మశానంలో కాటికాపర్లు చాలా కష్టపడి..... చనిపోయిన శవాలని దహన సంస్కారాలు, పూడ్చి పెట్టడం వంటి పనులని సంప్రదాయ పద్ధతిలో చేస్తూ ఉంటారని... అలాంటి వారిని కించపరుస్తూ చూపించడం కరెక్ట్ కాదని ఆ సంఘం ప్రతినిధులు వాదిస్తున్నారు.
అందుకే స్పైడర్ సినిమాలోని ఆ సన్నివేశాలని తక్షణం తొలగించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని వారు హెచ్చరికాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫలితంతో ఉసూరుమంటున్న చిత్ర బృందం ఇప్పుడు ఈ కాటి కాపర్ల హెచ్చరికలతో ఇంకెలాంటి ఇబ్బందుల్లో పడనున్నారో అంటున్నారు. మరో పక్క ఈ వివాదం పై మురగదాస్, ప్రొడ్యూసర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి