స్పైడర్ ఎఫెక్ట్ ఏం లేదు

Update: 2017-10-17 13:00 GMT

మహేష్ బాబు ఎంతో కష్టపడి ఏడాదిన్నరపాటు నటించిన స్పైడర్ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేక చతికిలపడింది. మహేష్ స్పైడర్ కు వచ్చిన స్పందనతో కాస్త డిస్పాయింట్ అయినప్పటికీ... ఇప్పుడు కొరటాల సినిమా మీద స్పైడర్ ఛాయలు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే స్పైడర్ చిత్ర నిర్మాతలకు తన పారితోషకం నుండి కొంత వెనక్కి ఇచ్చిన మహేష్ కి వరుసగా రెండు డిజాస్టర్స్ పడేటప్పటికీ ఆ తాలూకూ నెగిటివ్ టాక్ ఎమన్నా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను చిత్రం మీద పడుతుందేమో అని కొంతమంది కంగారు పడ్డారు.

అసలే 120 కోట్లపైబడి స్పైడర్ బిజినెస్ జరిగింది. అందులోను స్పైడర్ ఫలితం తీవ్ర నిరాశ పరిచింది. మరి భరత్ అనే నేను బిజినెస్ ఎలా ఉంటుందో అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో మొదలయ్యాయి. అయితే శ్రీమంతుడు తర్వాత మళ్ళీ అదే కలయికలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో అన్ని కమర్షియల్ హంగులతోపాటే కామెడీ హంగులు కూడా ఉన్నాయని.. స్పైడర్ ఫలితంతో కొరటాల భరత్ అనే నేను సినిమాకి కొంత మార్పులు చేర్పులు చేసాడంటున్నారు.

ఇక బయ్యర్లు కూడా ఎటువంటి ఆలోచన లు కొరటాల - మహేష్ కలయికలో వస్తున్న భరత్ అనే నేను సినిమా మీద పెట్టుకోకుండా బిజినెస్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా అసెంబ్లీని దడదడ లాడించబోతున్నాడు. మహేష్ సరసన బాలీవడ్ నటి కైరా అద్వానీ నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.

Similar News