స్టార్ హీరో వాళ్లకి అవిచ్చాడా..?

Update: 2017-08-02 09:00 GMT

కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు హీరో విజయ్. ఆయన తమిళంలో నటించిన తాజా చిత్రం భైరవ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు రాజా రాణి ఫెమ్ అట్లీ డైరెక్షన్ లో విజయ్ మెర్‌సల్ ఫిల్మ్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన టాప్ హీరోయిన్స్ సమంత, కాజల్ అగర్వాల్, నిత్య మీనన్ లు నటిస్తున్నారు. ఈ చిత్రంపై తమిళనాట భారీ అంచనాలేఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో విజయ్ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా నటించడంతో ఈ చిత్ర కథ ఎలా వుండబోతుందో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో వచ్చేసింది.

ఇకపోతే ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషెన్స్ కి విజయ్ ఒక బహుమతి ఇచ్చాడనే టాక్ ఇప్పుడు కోలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. తన ప్రాజెక్ట్‌ కోసం కష్టపడిన చిత్ర యూనిట్‌ సభ్యులకు విజయ్ ఊహించని బహుమతులు ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేశాడట. మెర్‌సల్ మూవీకి పనిచేసిన 200 మంది టెక్నీషియన్స్, వర్కర్స్ కి హీరో విజయ్ బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడనే విషయాన్ని కోలీవుడ్ ఎనలిస్ట్ రమేశ్ బాలా సోషల్ మీడియా ద్వారా అందరికి చేరవేసాడు. మరిఇలా ఒక స్టార్ హీరో తన సినిమా కోసం పనిచేసిన వాళ్ళకి ఇలా గిఫ్ట్స్ ఇస్తే వారెంత సంతోష పడిపోయిఉంటారో కదా..!

Similar News