స్టార్ హీరో పక్కన ఛాన్స్ కోటేసిన రకుల్

Update: 2018-01-09 08:04 GMT

టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమా చేయడం రకుల్ కి అలవాటు. ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అదే జోరు చూపిస్తంది. రీసెంట్ గా చేసిన బాలీవుడ్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఇంకో బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలా అని చిన్న హీరో పక్కన కాదు పెద్ద హీరో పక్కనే.

ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వంలో అయ్యారే సినిమా లో నటించింది. ఈ సినిమా ఈనెల 26న థియేటర్లలోకి రానుంది. ఇందులో ఆమె నటన చాలా బాగా చేసిందని బాలీవుడ్ మొత్తం గుసగుసలాడుతుంది. ఇది తెలిసిన అక్షయ్ కుమార్ తన నెక్స్ట్ మూవీలో రకుల్ కు ఛాన్స్ ఇచ్చాడు.

ముందునుండి అక్షయ్ కుమార్ సౌత్ హీరోయిన్స్ కి తన సినిమాలో ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు. అసిన్, జెనీలియా, కాజల్ లాంటి హీరోయిన్లకు ఇప్పటికే ఛాన్స్ ఇచ్చాడు. మళ్ళీ ఈ లిస్ట్ లో రకుల్ కూడా చేరిపోయింది.

Similar News