తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటుడు, హాస్య నటుడు సుధాకర్. హీరో అవుదాం అని సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సుధాకర్ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. అపట్లోని స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి.... హీరోల స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ ఇటీవల కాలంలో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. అయితే సుధాకర్ కి ఆమద్యన ఆరోగ్యం బాగోలేదని... కోలుకోలేని వ్యాధితో బాధపడుతున్నాడనే ప్రచారం జరిగింది. కానీ తనకే జబ్బు లేదని... తానూ ఆరోగ్యంగానే ఉన్నానని.... మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అయితే సుధాకర్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. అప్పట్లో అంటే కెరీర్ అరభంలో చిరంజీవితో కలిసి తిరిగిన సుధాకర్ ని ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని కొందరు అంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సుధాకర్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది. అయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కనిపించిన సుధాకర్ అప్పటిలా లేడు. దాంతో దర్శకనిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అనారోగ్య కారణంగా బక్కగా అయిన సుధాకర్ మళ్ళీ ట్రీట్మెంట్ తరువాత ఇప్పుడు కొంచెం బాగయ్యాడు. దాంతో మళ్ళీ ఆయనకు అవకాశాలు క్యూ కట్టేసాయి.
ప్రస్తుతం మూడు, నాలుగు తెలుగు సినిమాలతో పాటు తమిళంలో కూడా రెండు మూడు సినిమాలకి సైన్ చేసాడు అని తెలుస్తుంది. మరి అప్పట్లో స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సుధాకర ఇప్పుడు ప్రేక్షకులను ఎలా నవ్విస్తాడో అనేది చూడాలి.