ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న హీరోలు ఎక్కువగా మాస్ నే నమ్ముకుంటున్నారు. ఫైట్స్, యాక్షన్స్ సీన్స్ తోనే తమ హీరోయిజాన్ని చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గాని... ఒక ఫ్యామిలీ ఎంటెర్టైనతోనో లేకుంటే లవర్ బాయ్ గానో ఉండడానికి మాత్రం ఇష్టపడడంలేదు. ఇలానే ఒకప్పటి యంగ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్,నితిన్, నాని ఇంకా చాలామందే ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆ హీరోలంతా ఇలానే మాస్ ని నమ్ముకుని ఒకటి అరా హిట్స్ కొట్టినా ఆ తర్వాత మాస్ సినిమాలతో బోర్లా పడ్డారు. ఆ తర్వాతే వారు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో.. లవ్ ఎంటర్టైన్మెంట్స్ తోనే హిట్స్ కొట్టారు.
ఇప్పుడు అలానే మాస్ తో కొట్టుకుపోతున్న ఒక మెగా హీరో కూడా కుటుంభ కథా చిత్రాలకి, ప్రేమ కథా చిత్రాలకే ఓటేస్తున్నట్టు కనబడుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ ముందునుండి మాస్ ఎంటర్టైన్మెంట్స్ కే ఓటేస్తున్నాడు. మధ్యలో మాస్ చిత్రాలుతో ఒకమాదిరి హిట్స్ ఇచ్చిన ఆ తర్వాత మాత్రం ఘోరమైన ప్లాప్స్ ఇచ్చాయి. అందుకే ఇప్పుడు యాక్షన్ ని వదిలేసి ప్రేమకథ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు కనబడుతున్నాడు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన సాయి ధరమ్ తేజ తాజా చిత్రం 'జవాన్' సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. అయితే ఇప్పుడు ఆ మూవీని పక్కన పెట్టేసి ఆ సినిమాకి కాస్త రిపేర్లు మొదలెట్టింది చిత్ర టీమ్.
ఇకపోతే వినాయక్ తో సాయి తీస్తున్న చిత్ర కథ మాస్ గా ఉంటుందో, క్లాస్ గా ఉంటుందో తెలియదు గాని... ఇప్పుడు సాయి మాత్రం కరుణాకరణ్ డైరెక్షన్ లో ఒక లవ్ స్టోరీలో నటించబోతున్నాడు. ఇక కరుణాకరణ్ సినిమా విషయంలో సాయి ధరమ్ తేజ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అయితే ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకుండా చూడమని డైరెక్టర్ కరుణాకరణ్ కి చెబుతున్నాడట. మరి సాయి డెసిషన్ మాత్రం చాలా... బాగుందనిపిస్తుంది కదూ.!