టాలీవుడ్ లో అత్యంత అందగాడైన హీరోగా మహేష్ బాబుకు ఓ గుర్తింపు ఉంది. చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వుంది. అన్నీ అనుకూలంగా ఉన్నా ఈ మధ్య కమర్షియల్ హిట్ అన్నది మహేష్ కి అందకుండా పోతుంది. ఎ.ఆర్.మురుగదాస్ తో ఎంతో ఇష్టపడి, కష్టపడి మహేష్ బాబు 'స్పైడర్' సినిమా తీసినప్పటికి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కుప్పకూలింది. అటు ఫాన్స్ లోను ప్రేక్షకులలోను నిరుత్సాహాన్ని నింపాడు మహేష్ బాబు.
మాములుగా సినిమా నెగిటివ్ టాక్ వచ్చిందంటేనే అటు కలెక్షన్లపైన తీవ్ర ప్రభావం ఉంటుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ పబ్లిసిటి కూడా కలెక్షన్లపై ప్రభావం గట్టిగానే ఉంటుంది. అదే నెగెటివ్ పబ్లిసిటీ సోషల్ మీడియా సాక్షిగా మహేష్ నటించిన 'స్పైడర్' సినిమాకి జరిగింది. 'స్పైడర్' దెబ్బకి ఇప్పుడు మహేష్ సోషల్ మీడియాలో బలం పెంచుకోవాలని డిసైడ్ అయ్యాడు. మహేష్ సోషల్ మీడియా కి సంబందించిన బాధ్యతను ఆయన భార్య నమ్రత తీసుకుంది. మహేష్ నెక్స్ట్ సినిమా 'భరత్ అనే నేను' రిలీజ్ నాటికి సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ ఒపీనియన్ - బజ్ క్రియేటయ్యేలా ఈ భార్య భర్తలు ప్లాన్ చేస్తున్నారు.
దీని కోసం మహేష్ భార్య నమ్రత ఈ బాధ్యతను ఓ ఎక్స్పర్ట్ టీంకి అప్పగించిందనే టాక్ వినబడుతుంది. ఈ ఎక్స్పెర్ట్ టీం మహేష్ పేరు మీదున్న పేజీల్లో పోస్టయ్యే మెసేజీలు ఫాలో అవుతూ సోషల్ మీడియాలో నెట్ వర్క్ అకౌంట్లన్నింటినీ మేనేజ్ చేస్తుందట. అందులో భాగంగానే 'భరత్ అనే నేను' సినిమాకి సోషల్ మీడియాలో పాజిటివ్ న్యూస్ బాగా కనిపిస్తోంది అని అంటున్నారు . మరి ఈ సోషల్ మీడియా ఆలోచన మహేష్ కి ఏ మాత్రం పనికొస్తుందో చూడాలి.