'సై రా'లో అమితాబ్ చేసే కేరెక్టర్ ఇదే!!

Update: 2017-08-24 11:00 GMT

చిరంజీవి 151 చిత్రం 'సై రా' ఆఫీషియల్ గా సెట్స్ మీదకెళ్ళిపోయింది. ఎప్పటినుండో ఎదురు చూస్తున్న చిరు 151 స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా జాతీయస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 'బాహుబలి' చిత్రం తర్వాత అందరూ అదే జోనర్ లో ఆలోచిస్తున్నారు. 'బాహుబలి'లా దేశం మొత్తం విడుదల చేసేయ్యాలి..... అలాగే 'బాహుబలి' మించి హిట్ కొట్టేయాలని ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు తెగ ఆలోచించేస్తున్నాయి. అందులో టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళైతే మరీను. రాజమౌళి తీసిన బాహుబలిని కొట్టెయ్యాలనే కసితో చాలామంది ఉన్నారు.

ఇప్పుడు 'బాహుబలి'లా 'సై రా' చిత్రాన్ని కూడా ఆ రేంజ్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించి నాలుగు భాషల్లో విడుదల చెయ్యాలని 'సై రా' చిత్ర నిర్మాత రామ్ చరణ్, హీరో చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డిలు ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ ప్లాన్ లో భాగంగానే ఆ చిత్రానికి తెగ క్రేజ్ తీసుకురావడానికి అన్ని భాషల నటీనటులకు ఈ 'సై రా' చిత్రంలో చోటిచ్చారు. అన్ని భాషల్లోని అగ్ర నటులను ఈ 'సై రా' లో నటించేందుకు ఒప్పించారు. అయితే అందరిలో బాలీవుడ్ నటుడు అమితాబ్ ని ఒప్పించడమే 'సై రా' టీమ్ చేసిన పెద్ద ఎచీవ్మెంట్.

అమితాబ్ ని తమ సినిమాలో నటింపజేసేందుకు రామ్ చరణ్, సురేందర్ రెడ్డిలు బాగానే కష్టపడ్డారట . ఇక ఈ 'సై రా' లో అమితాబ్ చెయ్యబోయే కేరెక్టర్ ఏమిటంటే ఈ 'సై రా నరసింహరెడ్డి' కి గురువుగారు పాత్ర అట. అంటే చిరు కి గురువుగా అమితాబ్ కేరెక్టర్ ఉంటుందన్నమాట. అయితే 'సై రా' గురువు గారికి సినిమాలో పెద్ద కేరెక్టర్ లేకపోయినా కూడా అమితాబ్ బచ్చన్ పెద్ద నటుడు కావడం వలన కేవలం ఒకటి రెండు నిమిషాల నిడివి గల కేరెక్టర్ ఇస్తే బావుండదనే ఉద్దేశ్యంతో చిత్ర టీమ్ ఈ 'సై రా' గురువు గారి పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే కాక పాత్ర నిడివి కూడా మరీ తక్కువ కాకుండాచూసుకుందనే టాక్ వినబడుతుంది.

అలాగే అమితాబ్ కి ఆ 'సై రా' గురువు పాత్ర నచ్చడంతోనే వెంటనే 'సై రా' లో నటించేందుకు ఒకే చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఒక నిమిషం నిడివిగల పాత్ర బాలయ్య 'రైతు' చిత్రంలో అమితాబ్ చెయ్యకపోవడం వలెనే ఆ చిత్రం ఆగిపోయినట్లు కూడా వార్తలొచ్చాయి.

Similar News