'సై రా' పై క్యూరియాసిటీ పెంచిన డైరెక్టర్

Update: 2017-10-30 05:00 GMT

మెగా స్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర్య సమరయోధుడు 'సైరా నరసింహారెడ్డి' జీవిత చరిత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ తారాగణంతో, బడ్జెట్ తో అన్ని హంగులు కలుపుకుని రూపొందుతున్న ఈ చిత్రానికి మెగా అభిమానులులే కాదు దక్షిణాది ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ సురేందర్ రెడ్డి...నరసింహారెడ్డికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటున్న ప్రయత్నంలో.. రూపంగుడి ప్రాంతానికి వెళ్లి నరసింహారెడ్డి జీవితానికి సంబంధించిన పలు విశేషాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ సినిమా భారత దేశం గర్వించే స్థాయిలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. భారతీయులందరు 'సై రా' సినిమాతో సంతృత్తి పొందుతారని చెబుతున్నాడు.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫేర్ కాగా..రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Similar News