సై రా... నిజంగానే సై రా.

Update: 2017-11-04 11:00 GMT

చిరంజీవి హీరో గా అయన కొడుకు రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సై రా నరసింహ రెడ్డి'. స్వాతంత్ర సమరయోధుడు అయిన ‘ఉయ్యాల వాడ నరసింహం రెడ్డి’ జీవిత చరిత్ర ఆదరంగా తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతుందంటున్నారు. దాదాపు 150 నుండి 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇంతటి అద్భుతమైన సినిమాను ఎంత జాగ్రత్తగా తెరకెక్కించాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి అవుట్ ఫుట్ కోసం చిత్ర బృందం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో.... పరచూరి సోదరులు ఎంతో కష్ట పడుతున్నారు. ఇక వీరితో పాటే మరో మాటల రచయిత బుర్ర సాయి మాధవ్ కూడా 'సై రా' కి పవర్ ఫుల్ డైలాగ్స్ రాస్తున్నాడు. బుర్ర సాయి మాధవ్ రాసే డైలాగ్స్ 'సై రా' సినిమాకే హైలెట్ గా ఉంటాయంటున్నారు. అయితే ఈలోపు ఈ సినిమాలో చిరంజీవి చెప్పే ఒక డైలాగు సోషల్ మీడియాలో లీక్‌ అయింది. సాయి మాధవ్ బుర్ర తన శక్తికి మించిన ఈ సినిమాకోసం ఎంతో కష్టపడి డైలాగ్స్ రాస్తుండగా.... ఇప్పుడు ఆయన రాసిన ఒక డైలాగ్ పబ్లిక్ లోకి వచ్చేసింది.

'సై రా నరసింహారెడ్డి' సినిమాలో... ఈ డైలాగ్ బ్రిటిష్ సామ్రాజ్యాధి నేతలు చుట్టు ముట్టగా సైరా నరసింహా రెడ్డి చెప్పే డైలాగట అది. 'రేయ్…. నేను ఒట్టి చేతులతో వచ్చా…. నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్…. అయినా నా చేయి మీసం మీదకి వెళ్లేసరికి నీ బట్టలు తడిచిపోతున్నాయ్ రా….' అనే డైలాగ్ ఇప్పుడు మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అని చెప్పడానికి అని మెగా ఫాన్స్ విజిల్స్ వేసేస్తున్నారు. మరి రామ్ చరణ్, సురేందర్ రెడ్డి లు ఈ సినిమా విషయమై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ లీకులేమిటో అని తలలు పట్టుకుంటున్నారట.

Similar News