ఈమధ్య కాలంలో ఇండియన్ సినిమాలకు చైనా లో మంచి మర్కెట్ ఏర్పడింది. అక్కడ ఈమధ్యన విడుదలైన బాలీవుడ్ సినిమాలు అదిరిపోయే కలెక్షన్స్ కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించాయి. అందులో సీక్రెట్ సూపర్ స్టార్, దంగల్, బజరంగీ భాయీజాన్, బాహుబలి చిత్రాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు నేషనల్ స్థాయిలో తెరకెక్కే సినిమాలన్నీ చైనా మార్కెట్ ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాయి. ఎందుకంటే అక్కడ జనాభాతో పాటె... థియేటర్స్ సంఖ్యా చాలా ఎక్కువ. అయితే ఇతర భాషల చిత్రాలను చైనాలో విడుదల చేయాలంటే.. ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. కాకపోతే ఆయా సినిమాల లోని కొంత భాగాన్ని చైనాలో షూట్ చేస్తే.. గనక ట్యాక్స్ రిబేట్స్ కూడా ఉంటాయి.
అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా చిరు హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాని సౌత్ లోని పలు భాషలతో పాటుగా.... బాలీవుడ్ లోను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సై రా సినిమాని చైనాలో కూడా విడుదల చేసి సై రా మార్కెట్ ని పెంచాలని సైరా టీమ్ ప్లాన్ చేస్తుందట. మరి అక్కడ సినిమాని విడుదల చెయ్యాలంటే చాల కాస్టలీ వ్యవహారం గనక అక్కడ సై రా సినిమా షూటింగ్ కొంతమేర చేస్తే.. అక్కడి ప్రభుత్వం మంచి రాయితీలను పొందవచ్చు. అలాగే సైరా అక్కడ విడుదల ఈజీ అవుతుందని భావించిన సై రా బృందం సై రా లోని కొంత షూటింగ్ అంటే ఒక షెడ్యూల్ ని చైనా లొకేషన్స్ లో చిత్రీకరించనుందట.
ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న సైరా సెకండ్ షెడ్యూల్ లో చిరంజీవి, అమితాబచ్చన్, హీరోయిన్ నయనతార మీద చిత్రీకరణ జరిపి తర్వాత సై రా యూనిట్ పొల్లాచ్చి పయనమవుతుందట. పొల్లాచ్చిలో సై రా షూటింగ్ కొంతమేర కొనసాగుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ ను ( సైరా షూటింగ్ ని ) పూర్తిగా చైనాకే కేటాయించారని సమాచారం.