సై రా కోసం దిగుతున్న ఉపాసన!

Update: 2017-10-02 15:00 GMT

చిరంజీవి 151 వ చిత్రం సై రా నరసింహారెడ్డి సినిమా మొదలైంది... సినిమాలోని టాప్ నటీనటుల పేర్లు కూడాప్రకటించేసారు. కానీ సినిమానే ఇంతవరకు సెట్స్ మీదకెళ్ళలేదు. ఈ మధ్యన సై రా మీద అనేక రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. టాప్ టెక్నీషియన్స్ లో ఒకరు ఏ ఆర్ రెహ్మాన్ సైరా నుండి తప్పుకోవడం, అలాగే సినిమాటోగ్రాఫర్ రవివర్మ కూడా సై రా నుండి సైడ్ అవడం వంటి న్యూస్ లు మాత్రమే కాదు రవివర్మ ప్లేస్ లోకి అప్పుడే రంగస్థలం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ని సై రా కోసం సెట్ చెయ్యడం కూడా జరిగింది అంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన సై రా చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ గా చేయబోతున్నట్లు ప్రచారంమొదలైంది. రామ్ చరణ్ సై రా నిర్మాతగా వ్యవహరించడంతో ఉపాసన సై ర కి నిజంగానే లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తుందేమో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

రామ్ చరణ్ రంగస్థలం షూటింగ్ తో బిజీగా ఉండడం వలన ఉపాసన సై రా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటుందని టాక్ వినబడుతుంది. కేవలం రామ్ చరణ్ రంగస్థలం పూర్తయ్యే వరకే ఉపాసన ఆ బాధ్యతలు చేపడుతుంది అంటున్నారు. మరి ఉపాసన ఇప్పటికే తన సొంత సంస్థ అయినా అపోలో బాధ్యతల్లో చురుకుగా పాల్గొంటుంది. మరి ఇప్పుడు మామగారు చిరు 151 వ చిత్రంకోసం సినిమా పరిశ్రమలోకి కూడా అడుగెట్టబోతుంది అంటున్నారు.చూద్దాం ఉపాసన సై రా బాధ్యతలు ఏమేర చక్కబెడుతుందో. ఇకపోతే సైరా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇదిగో..అదిగో అంటున్నారు కానీ ఇంకా మొదలయ్యే సూచనలు కనబడం లేదంటున్నారు.

Similar News