సెకండ్ వీక్ కూడా రాజే సక్సెస్ సాధించేలా ఉన్నాడు

Update: 2017-08-20 08:00 GMT

ఆగష్టు 11 న విడుదలైన మూడు సినిమాలు 'లై, జయ జానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి' పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్నప్పటికీ కలెక్షన్స్ కొల్లగొట్టిన వాటిలో మాత్రం.... తేజ డైరెక్షన్ లో రానా హీరోగా కాజల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి టాప్ ప్లేస్ లో నిలిచింది. అంటే మూడు సినిమాల్లో రాజుగా నిలిచింది మాత్రం 'నేనే రాజు నేనే మంత్రి' అన్నమాట. ఇప్పుడు ఈ 'నేనే రాజు...' సక్సెస్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది. రానా హీరోగా తెరకెక్కిన సినిమాల్లో సోలో గా ఇవే సూపర్ కలెక్షన్స్ అనే టాక్ నడుస్తోంది. అలాగే 'జయ జానకి నాయక' మాత్రం సెకండ్ ప్లేస్ లో కొనసాగుతూ కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉంది. అయితే అన్నిటిలో వెనుకబడిన నితిన్ హీరోగా వచ్చిన 'లై' సినిమా సరైన ప్రమోషన్ లేక రేసులో ఆశించిన రేంజ్ కలెక్షన్స్ రాబట్టలేక చతికిల పడడం... బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ' జయ జానకి నాయక' మూవీకి అడ్వాంటేజ్ అయ్యింది. సెకండ్ వీక్ లో కూడా రానా 'నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక' సినిమాలే స్టడీగా కలెక్షన్స్ కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ సినిమాల ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ మీకోసం.

'నేనే రాజు నేనే మంత్రి' ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్స్

నైజాం 6 కోట్ల 15 లక్షలు

ఉత్తరాంధ్ర 2 కోట్ల 20 లక్షలు

సీడెడ్ 2 కోట్ల 05 లక్షలు

ఈస్ట్ కోటీ 38 లక్షలు

కృష్ణ కోటీ 16 లక్షలు

గుంటూరు కోటీ 15 లక్షలు

వెస్ట్ 72 లక్షలు, నెల్లూరు 42 లక్షలు.

టోటల్ ఏపీ - తెలంగాణ 15 కోట్లు

అమెరికా కోటీ 40 లక్షలు,

కర్ణాటక కోటీ 10 లక్షలు

ఇతర ప్రాంతాలు 62 లక్షలు

టోటల్ వరల్డ్ వైడ్ 18 కోట్ల 36 లక్షలు

'జయ జానకీ నాయక' ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్స్

నైజాం 4 కోట్ల 40 లక్షలు

సీడెడ్ 3 కోట్ల 02 లక్షలు

ఉత్తరాంధ్ర 2 కోట్ల 05 లక్షలు

గుంటూరు కోటీ 40 లక్షలు

ఈస్ట్ కోటీ 15 లక్షలు

వెస్ట్ 98 లక్షలు

కృష్ణ 86 లక్షలు

నెల్లూరు 73 లక్షలు

టోటల్ ఆంద్ర - తెలంగాణ 14 కోట్ల 59 లక్షలు

కర్ణాటక 90 లక్షలు

అమెరికా 25 లక్షలు

ఇతర ప్రాంతాలు 45 లక్షలు

టోటల్ వరల్డ్ వైడ్ 16 కోట్ల 19 లక్షలు

Similar News