డాక్టర్ రామానాయుడు బతికున్నంత వరకు సురేష్‌ప్రొడక్షన్స్ సంస్థ ఓ వెలుగు వెలిగింది. ఈ బేనర్ నుంచి మూడు పెద్ద చిత్రాలు.. ఆరు చిన్న చిత్రాలు అన్నట్లుగా నిత్యం చిత్రాలు వచ్చేవి. పది మందికి పని దొరికేది. కానీ ఆయన మరణం తర్వాత సురేష్‌బాబు తన తండ్రి పేరును నిలబెట్టడంతో తీవ్రంగా వైపల్యం చెందాడు. తమ ఫ్యామిలీలోనే వెంకటేష్, రానా దగ్గుబాటి, అక్కినేని నాగచైతన్య వంటి హీరోలు ఉన్నప్పటికీ ఈయన తన పిసినారి తనం చూపిస్తున్నాడు. తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలు కొల్లగొట్టడం ఎలా? అని తప్పితే సినిమాకి తగ్గట్లు ఖర్చు పెట్టడం, ఇటు చిన్న అటు పెద్ద చిత్రాలు రెండింటిని తీయడం, సినిమాల కథలను కరెక్ట్‌గా జడ్జ్ చేయలేమోనని తనకు తాను భయపడుతున్నట్లుగా ఉంది ఆయన ధోరణి.
సురేష్ బాబు 'పెళ్లిచూపులు' చిత్రాన్ని తానే రిలీజ్ చేశాడు. దాంతో సినిమా చూసి కొత్త దర్శకుడైన తరుణ్‌భాస్కర్‌లో విషయం ఉందని గ్రహించాడు. అనుకున్నట్లుగానే 'పెళ్లిచూపులు' పెద్ద విజయం సాదించడం, చిత్రానికి, ఈ చిత్రం స్క్రీన్‌ప్లేకి గాను తరుణ్‌భాస్కర్‌కి కూడా జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది. కానీ ఎంతో ముందు చూపు ఉన్న సురేష్‌బాబు ఈ దర్శకుడిని తన బేనర్‌లోనే బంధించేశాడు. 'పెళ్లిచూపులు' తదుపరి చిత్రం తన బేనర్‌లో, తాను చెప్పిన బడ్జెట్‌లో అంతాకొత్తవారితో చేయాలని కండీషన్ పెట్టాడట.
దాంతో పలువురు హీరోలు తరుణ్‌భాస్కర్ డైరెక్షన్‌లో చేయడానికి ముందుకొచ్చినా.... సురేష్ బాబు వలన వాటిని వదులుకునే పరిస్థితి వచ్చింది తరుణ్ కి. ఎలాగైతేనేమి.. చిన్నగా చాలా గ్యాప్ తీసుకుని సురేష్‌ప్రొడక్షన్స్‌లో సినిమాని పట్టాలెక్కించాడు. ఇది కూడా న్యూ జనరేష్ స్టోరీనే అట. మరి మళ్ళీ కొత్త వాళ్లతో సినిమా తెరకెక్కించి సురేష్ బ్యానర్ లో తరుణ్ భాస్కర్ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూద్దాం.