సునీల్ పనైపోయినట్లేనా?

Update: 2017-12-15 12:00 GMT

కమెడియన్ కాస్తా హీరో గా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన సునీల్ ప్రస్తుతం హీరో గా బ్యాడ్ స్టేజి లో ఉన్నాడు. ఎందుకంటే హీరో గా సునీల్ వరుస పరాజాయాల్తో కొట్టుకుపోయాడు. అసలు సునీల్ హీరోగా సినిమా విడుదల చెయ్యాలి అంటే... చాలా కష్టపడాల్సిన పరిస్థితుల్లో నిర్మాతలు ఉన్నారు. ఎందుకంటే సునీల్ సినిమాలకు అస్సలు మార్కెట్ లేదు. మరోపక్క సునీల్ కి కమెడియన్ గా కూడా అవకాశాలు లేవు. కెరీర్ లో అత్యంత క్రిటికల్ పరిస్థితి లో ప్రస్తుతం సునీల్ ఉన్నాడు. అయితే సునీల్ హీరో గా నటించిన తాజా చిత్రం టు కంట్రీస్ రిలీజ్ కి రెడీ గా ఉంది.

ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కాస్తో కూస్తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఇక సునీల్ కి హీరో అవకాశాలు వస్తాయా అంటే.. ఏమో చెప్పలేం అంటున్నారు. ఎందుకంటే తాజాగా సునీల్ కి జ్యోతి ఫిలిమ్స్ నిర్మాతలు షాకిచ్చారంటున్నారు. అదేమిటంటే... సునీల్ 2014 లో తమిళంలో విడుదలై హిట్ చిత్రంగా నిలిచిన శతురంగ వెట్టై రీమేక్ లో నట్టిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాని ఇప్పుడు ఆ మూవీ నుంచి సునీల్ ని తప్పించారనే వార్తలు ఫిలిం నగర్ లో హలచల్ చేస్తున్నాయి. నిజంగానే జ్యోతి ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ మొదట ఈ మూవీలో హీరో గా సునీల్ ని అనుకున్నారు.

కాని మార్కెట్ లేని సునీల్ తో సినిమా చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని గ్రహించిన నిర్మాత ఇప్పుడు సునీల్ ప్లేస్ లోకి వేరే హీరోని తీసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ వేరే హీరో ఎవరో కాదు.... జ్యోతి లక్ష్మి సినిమాతో పేరు తెచ్చుకున్న సత్య దేవ్ ని హీరో గా తీసుకున్నారనే టాక్ వినబడుతుంది. మరి నిజంగా ఈ వార్త నిజమే అయితే.. సునీల్ కెరీర్ హీరో గా కూడా క్లోజ్ అయినట్టే అనిపిస్తుంది.

Similar News