సునీల్ దారిలోకొచ్చాడా?

Update: 2017-09-14 09:00 GMT

సునీల్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కమెడియన్ గానే ఎంట్రీ ఇచ్చాడు. కామెడీతో సినిమాల్లో ఎంటర్టైన్ చేస్తూ ఆకట్టుకున్న సునీల్ ఆ తర్వాత హీరో అవతారమెత్తాడు. అప్పట్లో హీరోగా చేసినా, కొన్ని సినిమాల్లో కమెడియన్ గా కూడా చేసాడు. కానీ రాజమౌళి మర్యాదరామన్న సినిమా తర్వాత సునీల్ పూర్తిగా కామెడీ పాత్రలకు దూరమై హీరోగానే సెటిల్ అయ్యాడు. కొన్ని సినిమాలు హీరోగా సక్సెస్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత సునీల్ కి హిట్ అనేదే లేకుండా పోయింది. సునీల్ హీరోగా వస్తున్నాడు అంటే ఆ సినిమాపై ఎటువంటి అంచనాలుగాని, ఆసక్తిగాని జనాల్లో లేకుండా పోయింది

అందుకే సునీల్ ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. తాను హీరోగా చేసిన తాజా చిత్రం ఉంగరాల రాంబాబు విడుదల సందర్భంగా తాను మళ్ళీ కమెడియన్ గా కూడా సినిమాల్లో చేస్తానని చెబుతున్నాడు. కథ, దర్శకుడు అన్ని నచ్చితేనే హీరోగా సినిమాలు చేస్తానని.. అలాగే కమెడియన్ గా కూడా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు. మరి సునీల్ ఈ ఏడాది మొదట్లో వచ్చిన చిరు కమ్ బ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 లోనే కమెడియన్ గా చిరు పక్కన చెయ్యాల్సి ఉంది. కానీ సునీల్ హీరోగా కమిట్ అయిన దర్శకనిర్మాతలు అభ్యంతరం చెప్పడంతో అప్పట్లో చెయ్యడం కుదర్లేదు.

అయితే ఇప్పుడు హీరోగా చెయ్యబోయే సినిమాలు మొదలెట్టే ముందే దర్శక నిర్మతలకు తాను నిర్ణయం చెబుతానని.... ఇకమీద కమెడియన్ గా కనబడతానని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అయితే పవన్ - త్రివిక్రమ్ సినిమాలో మిస్ అయిన సునీల్ ఇపుడు త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాలో కమెడియన్ గా మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడేమో అంటున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ గతంలో హీరోగా చేస్తున్న సునీల్ ని మళ్ళీ కమెడియన్ చేసి తాను అవకాశాలు పోగట్టలేనని చెప్పాడు. మరి ఇప్పుడు సునీల్ కమెడియన్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు కాబట్టి త్రివిక్రమ్ తన సినిమాల్లోకి సునీల్ పక్కాగా తీసుకుంటాడంటున్నారు. చూద్దాం సునీల్ పరిస్థితి ఎలా వుండబోతుందో...!

Similar News