టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కి తెలుగు నటీనటులకు పెద్దగా క్రేజ్ లేదు. తెలుగులో కేవలం హీరోలకు మాత్రమే మంచి కెరీర్ ఉంటుంది. కానీ హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి తెలుగు హీరోలు, దర్శక నిర్మాతలు ఎల్లప్పుడూ పరభాషా హీరోయిన్స్ కే ఓటెయ్యడంతో... తెలుగు హీరోయిన్స్ పక్క భాషలకు తరలిపోవాల్సిన పరిస్థితి ఉంది. అలా వెళ్లిన వాళ్ళు పర భషాల్లో సక్సెస్ అయినవాళ్లు కొంతమంది ఉంటే.... సక్సెస్ కాలేక సినిమాల్లో నుండి తప్పుకున్నోళ్లు చాలామందే ఉన్నారు. అయితే తెలుగులో ఇప్పుడు ఒక అమ్మాయి సుకుమార్ రంగస్థలం తో అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది.
సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన దర్శకుడు సినిమాతో వెండితెరకు పరిచయమైన పూజిత పొన్నాడ... ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న రంగస్థలంలో కీలక పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టికి జంటగా ఎంపిక చేసాడు సుకుమార్. దర్శకుడు సినిమాలో పూజిత పొన్నాడ నటనకు మెచ్చిన సుకుమార్ రంగస్థలం లో ఆమెని ఆదికి జోడిగా తీసుకున్నాడు. అయితే సుకుమార్ తనకి దర్శకుడు సినిమాలో ఛాన్స్ ఇవ్వబట్టి.. మళ్ళీ ఇపుడు కూడా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టే కథ కూడా తెలుసుకోకుండానే రంగస్థలంలో నటించడానికి ఒప్పుకున్నాని చెబుతుతుంది ఈ తెలుగమ్మాయి పూజిత పొన్నాడ.
సుకుమార్ తో కలిసి వర్క్ చెయ్యడం తనకి చాలా ఇష్టమని, సుకుమార్ తనకి మార్గదర్శకుడిలా భావిస్తానని... కేవలం సుకుమార్ అడిగారని రంగస్థలంలో తన పాత్ర గురించి ఎలాంటి విషయాలు కనుక్కోకుండానే రంగస్థలంలో నటించడానికి ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది పూజిత. మరి మొన్నామధ్యన రామ్ చరణ్ తో పూజిత పొన్నాడ దిగిన ఫోటో నెట్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే.