మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న 'స్పైడర్' చిత్రం షూటింగ్ ముగింపు దశలో వుంది. రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారిగా మహేష్ బాబుతో జోడి కడుతున్న 'స్పైడర్' చిత్రం దసరాకి విడుదల చేస్తున్నట్లు టీజర్ లో ప్రకటించారు. ఇక మహేష్ బాబు తాజాగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న 'భరత్ అను నేను' చిత్రంలో నటిస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రంలో మహేష్ సీఎంగా కనబడతాడనే ప్రచారం జరుగుతుంది.మరి కొరటాల డైరెక్షన్ లో ఇప్పటికే 'శ్రీమంతుడు' వంటి హిట్ అందుకున్న మహేష్ ఇప్పుడు 'భరత్ అను నేను' చిత్రంతో కూడా హిట్టందుకోవాలని ఆరాటపడుతున్నాడు.
ఇక కొరటాల శివ మూవీ కంప్లీట్ కాగానే మహేష్ బాబు తన 25 వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేయనున్నాడు. మరి ఈ సినిమాపై వంశీ పైడిపల్లి చాలా ఎగ్జైటెడ్ గా వున్నాడట. స్క్ట్రిప్ట్ పరంగా ఈ చిత్రం చాలా కొత్తగా ఉండబోతుందని చెబుతున్నారు. ఇక వంశీ, మహేష్ తో చేసే చిత్రంపై స్పందిస్తూ మహేష్ ఫస్ట్ టైమ్ కథ విన్నప్పుడు చాలా ఎగ్జైటెడ్ గా ఫీలయ్యాడు. మహేష్ కూడా సినిమా మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరి మహేష్ నాతొ సినిమా చెయ్యడానికి చాలా ఇంట్రెస్హ్ చూపించడం నాకు ఒక దర్శకుడిగా మంచి ఉత్సాహాన్నిస్తుంది అని అంటున్నాడు.
మరి వంశీ పైడిపల్లితో మహేష్ చేసే సినిమాకి దిల్ రాజు నిర్మాతగా చెబుతున్నారు. అలాగే హీరోయిన్ గా 'డీజే' భామ పూజ హెగ్డే పేరు కూడా బలంగా వినిపిస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి అంటే ఈ సినిమాకున్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు మహేష్ అభిమానులు.