ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది అంటే.. ఆ సినిమాకి అనేకమంది టెక్నీషియన్స్, అనేకమంది నటీనటుల కలిసి పని చేస్తారు. సినిమా అంటే కేవలం ఒక హీరో, ఒక డైరెక్టర్ మాత్రమే కాదు. కాకపోతే అందరి దృష్టిలో సినిమా అంటే ఒక హీరో, ఒక డైరెక్టర్ అనే భావనతోనే ఉన్నారు. అందుకే సినిమా విడుదలయ్యాక విజయం సాధిస్తే అది హీరో పనితనంగానే చెబుతారు. అలా కాకుండా సినిమా గనక ప్లాప్ అయితే ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడికే అప్పజెబుతారు. ఎక్కడో రాజమౌళి లాంటి దర్శకులకు పేరొచ్చిందని మిగతా దర్శకులకు అలాంటి సీన్ అయితే లేదు.
అయితే టాలీవుడ్ సీనియర్ హీరో ఒకరు మాత్రం సినిమా విషయంలో తేడా వస్తే అది కేవలం డైరెక్టర్ డే బాధ్యత అన్నట్టు ప్రవర్తించడం తరచూ జరుగుతుంది. ఆ హీరో ఎవరో కాదు నాగార్జునే. నాగార్జున తాను నటించిన సినిమా ఏదైనా ప్లాప్ అయ్యింది అంటే.. దానికి కారణం దర్శకుడే అంటున్నాడు. గతంలో నాగ్ నటించిన భాయ్ సినిమా ప్లాప్ అవడంతో ఆ చిత్ర దర్శకుడు వీరబద్రం చౌదరి మీద కోపం కనబరిచిన నాగార్జున.. తన రెండో కొడుకు అఖిల్ సినిమా ప్లాప్ అయినప్పుడు వి వి వినాయక్ నే తప్పు బట్టాడు. ఆ సినిమా ప్లాప్ తో నితిన్ ప్రొడ్యూసర్ గా చాలానే నష్టపోయాడు.
అందుకే అఖిల్ సినిమా ప్లాప్ తో అసలు అఖిల్ సినిమాని అఖిల్ చెయ్యలేదన్నట్లుగా, హలో సినిమాతో టాలీవుడ్ కి అఖిల్ ని రీ లాంచ్ చేస్తున్నట్లుగా ఎప్పటినుండో చెబుతున్న నాగ్ ఇప్పుడు హలో ఆడియో లో కూడా హలో సినిమాతోనే అఖిల్ ఇండస్ట్రీకి వస్తున్నట్లుగా మాట్లడాడు. హలో సినిమాని ఏమాత్రం తగ్గకుండా తన బ్యానర్ లో నిర్మించినట్లుగా... ఈ సినిమా నిర్మాణంలో, చాలా జాగ్రత్తలు వహించినట్లకుగా చెప్పుకొచ్చాడు. మరి నాగ్ ఇలా హలో విషయంలో అతి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. హలో టాక్ లో తేడా వస్తే మాత్రం దర్శకుడు విక్రమ్ పనియైనట్లే అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.