సిద్దార్ద్ సినిమాలని పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు

Update: 2017-10-03 16:48 GMT

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సిద్ధార్థ్ అంటే తెలుగింటి కుర్రోడు అనే భావిస్తారు. త‌మిళుడే అయినా.. ఇక్క‌డ‌ అంతగా అభిమానం సంపాదించుకున్నాడు. మెగా హీరోలే మెచ్చిన హీరో సిద్ధార్థ్‌. అయితే అలాంటి స‌న్నివేశం నుంచి ఒకానొక బ‌ల‌హీన క్ష‌ణంలో అప‌జ‌యాలు అత‌డి భ‌విష్య‌త్‌నే ప్ర‌శ్నార్థ‌కం చేయ‌డం అభిమానుల‌కే స‌మాధానం లేని ఓ ప్రశ్న‌గా మిగిలిపోయింది. సిద్దార్ద్ కి తెలుగులో సక్సెస్ వచ్చి చాలాకాలమే అయింది. అయినా సరే హిట్ కొట్టాలన్న కసితో సినిమాలు చేస్తూనే వున్నాడు. కానీ సిద్దార్ద్ సినిమాలని పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు. అందుకే ఈసారి ట్రెండ్ ని ఫాలో అవుతూ హారర్ మూవీతో వస్తున్నాడు ఈ లవర్ బాయ్. ఒక అత్యుత్త‌మ ప్ర‌తిభ తెర‌వెన‌క్కి వెళ్లిపోయిందే అంటూ అంతా బాధ‌ప‌డ్డారు కూడా.

అయితేనేం సిద్ధార్థ్ మ‌ళ్లీ వ‌స్తున్నాడు. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా మ‌రోసారి తానేంటో నిరూపించుకునేందుకు వ‌స్తున్నాడు. మిలింద్‌రావ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ ది హౌస్ నెక్స్ట్ డోర్ టైటిల్ తో తెలుగు, తమిళ్, హిందీలో తెరకెక్కిన సినిమా తెలుగులో గృహం పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సిద్ధార్థ్‌ విడుదల చేశారు. చీకటిలో ఓ ఇల్లు.. సీరియస్‌గా సిద్ధార్థ్‌, ఆండ్రియా.. వీరిద్దరి మధ్య గాలిలో ఓ యువతి.. ఆసక్తికరమైన టీజ‌ర్ రిలీజైంది. హారర్ బ్యాక్‌డ్రాప్‌లోని ఈ చిత్రం సిద్ధార్థ్‌కి విజ‌యం ఇస్తుంద‌నే ఆశిద్దాం. నేటి సాయంత్రం 7.30 గంటలకు జరిగే ప్రొ-కబడ్డీ మ్యాచ్‌లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తామ‌ని సిద్ధార్థ్‌ ట్వీట్‌ చేశారు. నవంబరు 3న సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ స్వ‌యంగా పెట్టుబ‌డులు పెడుతుండ‌డం విశేషం. ఈ సినిమాతో సిద్ధార్థ్‌కి హీరో కం నిర్మాత‌గా గ్రాండ్ వెల్‌కం ల‌భిస్తుంద‌నే ఆశిద్దాం.మరి హారర్ మూవీతో అయినా ఈ లవర్ బాయ్ కి సక్సెస్ వస్తుందో లేదో తెలియాలంటే నవంబర్ వరకూ ఆగాల్సిందే.

Similar News