నాగ చైతన్య - సమంత ల పెళ్లి గోవా లో ఈ నెల 6 , 7 న హిందూ క్రిష్టియన్ సంప్రాయాల్లో జరగబోతున్న విషయం తెలిసిందే. పెళ్లి సింపుల్ గా చేసుకుంటామని ఈ జంట నాగార్జున కి చెప్పడం... నాగ్ కూడా ఓకే చెయ్యడం జరిగిపోయాయి. ఇక కొంతమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే చైతు - సామ్ లు పెళ్లాడబోతున్నారు. డబ్ల్యూ రిసార్ట్స్ లో జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం సింపుల్ అని చెబుతున్నప్పటికీ భారీ ఏర్పాట్లే జరుగుతున్నాయట.
మరి ముందు నుండి పెళ్లి సింపుల్ గా జరుగుతుంది అని చెబుతున్నప్పటికీ ఈ పెళ్ళికి భారీగా అంటే 10 కోట్ల పెడుతున్నారట. మరి సింపుల్ పెళ్ళికి ఇంట భారీ ఖర్చా అని నోరు తెరుస్తున్నారు చాలామంది. మరి సింపుల్గా 10 కోట్లు ఖర్చు చేస్తే భారీ పెళ్ళికి 200 కోట్ల పైనే ఖర్చు అవుతుందన్నమాట. నిజమే పెద్దోళ్ల పెళ్లిళ్లు సింపుల్ గా 10 కోట్లు ఖర్చయితే భారీ పెళ్ళికి మాత్రం వందల కోట్లలో ఖర్చవుతూ ఉంటుంది అది జగమెరిగిన సత్యమే. ఇక ఒకరోజు అంటే 6 న హిందూ సాంప్రదాయంలో పెళ్లి జరుపుకోనున్న చైతు సామ్ లు అక్టోబర్ 7 న ఈ పెళ్లిని క్రిష్టియన్ సాంప్రదాయంలో జరుపుకునే విషయం తెలిసిందే.