బాహుబలిలో కండలు పెంచి, ఆజానుబాహుడిగా అదరగొట్టిన ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాడు. బాహుబలితో కెరీర్ లో నిలిచి పోయే హిట్ అందుకున్న ప్రభాస్ నెక్స్ట్ చిత్రం సాహో మీద బాహుబలి ప్రభావం చాలానే ఉంది. బాహుబలిలో నటించిన తర్వాత ప్రభాస్ కి సంబందించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో ఉంటుంది. ప్రభాస్ కి సంబందించిన ప్రతి చిన్న విషయాన్నీ ప్రేక్షకులు , అభిమానులు ఎంతో ఆసక్తితో గమనిస్తున్నారు. ఇక ప్రభాస్ సాహో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సాహో కి సంబందించిన ప్రభాస్ లుక్ వచ్చే సోమవారం ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేస్తారనే టాక్ ఉంది.
అయితే ఇప్పుడు సడన్ గా ప్రభాస్ స్మైలీ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. డీసెంట్ లుక్ లో అదిరిపోయే అందంతో సింపుల్ గా చిన్న స్మైల్ ఇస్తూ ఏందో అందంగా గ ఉన్న లుక్ ని ప్రభాస్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఆ లుక్ లో ప్రభాస్ వయస్సు ముప్పై దాటింది అంటే ఎవరు నమ్మరు. ఇంకా పాతికేళ్ల కుర్రాడిలాగే కనబడుతున్నాడు. అయితే ప్రభాస్ విడుదల చేసిన ప్రభాస్ లుక్ సాహో సినిమాకి సంబంధించిందా? లేకుంటే ఊరికే ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి ప్రభాస్ ఈ లుక్ ని సరదాగా వదిలాడా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ నటిస్తుంది. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ తోపాటు సాహో మేకింగ్ వీడియో ని ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా అక్టోబర్ 23 న వదలడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు.