పోయిన ఏడాదిలో దేవి శ్రీ ప్రసాద్ నుంచి చాలానే ఆల్బమ్స్ వచ్చాయి. అందులో కొన్ని మంచి స్పందనే తీచుకున్నాయి కానీ కొన్ని మాత్రం నెగటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఏడాది చివర్లో వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమా మాటలు చాలా రొటీన్ గా వున్నాయి అని ఆ మధ్య చర్చ నడిచింది. అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఏం అంత బాగోలేదని మ్యూజిక్ పండిట్స్ అనుకున్నారు.
తానేంటో రుజువుచేసుకునేందుకు....
దేవి తర్వాత వచ్చిన అనిరుద్.. అనూప్.. థమన్ చాలా ఫ్రెష్ ట్యూన్స్ ఇచ్చి వరబెట్టి సినిమాలు మీద సినిమాలు చేస్తూ వెళ్లిపోతున్నారు. కానీ దేవి మాత్రం వెనకపడిపోయాడు. దింతో అతని పని అయిపోయిందని అంత అనుకున్నారు. ఐతే ఈ ఏడాది ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’ లాంటి ఎగ్జైటింగ్ సినిమాలు దేవిశ్రీ చేతిలో ఉండటంతో వీటితో బౌన్స్ బ్యాక్ అవుతాడని.. తనేంటో రుజువు చేస్తాడని అతడి అభిమానులు ఆశించారు.
టీజర్ అదిరిపోవడంతో....
అందుకు తగ్గట్టుగానే ‘రంగస్థలం’ టీజర్ తో తన ముద్ర వేసుకున్నాడు. ఈ చిత్ర టీజర్లలో బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ.. ఇప్పుడు ‘ఎంత సక్కగున్నావే’ పాట కానీ గొప్ప ప్రశంసలందుకున్నాయి. ముఖ్యంగా నిన్న రిలీజ్ అయినా ‘ఎంత సక్కగున్నావే’ పాట సంచలనం రేపుతోంది. చాలా హాయిగా అనిపించే ట్యూన్, గానంతో అదరగొట్టేశాడు దేవి. ఆ సినిమాలో అన్ని పాటలు అలానే ఉంటాయి అని తన ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే ‘భరత్ అనే నేను’తోనూ దేవి మ్యాజక్ చేస్తాడేమో చూద్దాం.