బాహుబలి సీరీస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ట్మాక చిత్రం 'సాహో'. ఈ సినిమాని కూడా దేశవ్యాప్తంగా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు దర్శకుడు సుజిత్ అండ్ నిర్మాతలు యూవీ క్రియయేషన్స్ వారు. అందుకే 'సాహో' కోసం ప్రతి ఒక్క విషయాన్నీ ఇంటర్నేషనల్ లేవల్లోనే ఆలోచిస్తున్నారు వీరు. అందులో భాగంగానే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ని హాలీవుడ్ నిపుణుల అధ్వర్యంలో కళ్ళు చెదిరేలా తీయబోతున్నారని.... కేవలం యాక్షన్ ఎపిసోడ్ కే 40 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఎప్పటినుండో... ఫిలిం నగర్ టాక్.
ఇక ఆ యాక్షన్ సన్నివేశాల కోసం దుబాయ్ లో 75 రోజుల పాటు ఆ యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి అన్ని విధాలా ఏర్పాట్లు చేసుకుంది చిత్ర బృందం. 'సాహో' ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకొని హాలీవుడ్ టీంతో దుబాయ్ షెడ్యుల్ కి రెడీ అయ్యాడు డైరెక్టర్ సుజీత్. అయితే ఇప్పుడు సాహో టీమ్ కి దుబాయ్ ప్రభుత్వం షాకిచ్చింది.అదేమిటంటే... 'సాహో' టీం షూటింగ్ చేయాలనుకున్న ప్రాంతాల్లో ప్రజలకి బాగా ఇబ్బంది అవుతుందని.... ఈ సమయంలో మీకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పే సిందట దుబాయ్ గవర్నమెంట్.
దాంతో ఖంగుతిన్న చిత్రం బృందం ఒక టీం ని ఆ పనిపై పెట్టి దుబాయ్ నుంచి మిగతా 'సాహో' టీం హైదరాబాద్ కు చేరుకుంటుంది. ఇకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసాక మళ్ళి దుబాయ్ షెడ్యూల్ పై దృష్టి పెడతారట . శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ విలన్స్ నటిస్తున్నారు.