ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'సాహో' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ లుక్ లో ప్రభాస్ స్టైలిష్ గా పెద్ద కోట్ వేసుకుని ఫారిన్ బ్యాగ్రౌండ్ లో ఎత్తైన భవనాల మధ్యన మొహానికి స్కార్ఫ్ చుట్టుకుని నడిచొచ్చే లుక్ లో ప్రభాస్ అదరగొట్టాడు. ఇక ఈ ప్రభాస్ 'సాహో' లుక్ తో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా... యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే ప్రభాస్ 'సాహో' లుక్ అలా విడుదలైందో లేదో ఈ లుక్ కాపీ అంటూ కొందరు సోషల్ మీడియాలో సైటైర్లు వేయడం మొదలుపెట్టారు.
ఈ లుక్ మొత్తం హాలీవుడ్ సినిమా ‘బ్లేడ్ రన్నర్ 2049’ సినిమా పోస్టర్ ను కలిపేసి… ప్రభాస్ మూవీ పోస్టర్‌ను రూపొందించారని పక్క పక్కనే పోస్టర్లు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. మరి ఆ రెండు పోస్టర్ ని పక్క పక్క నే పెట్టి చూస్తుంటే మాత్రం నిజంగానే 'సాహో' లుక్ కాపీనా అని అనిపించక మానదు. అంతలా ఉన్నాయి ఈ రెండు లుక్స్ కూడా. సేమ్ టు సేమ్ ఒకేలా కనబడుతున్నాయి రెండు పోస్టర్స్ కూడా. మరోపక్క ప్రభాస్ పుట్టినరోజు కి విష్ చేస్తూనే సాహో లుక్ సూపర్ అంటూ టాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తం సోషల్ మీడియాలో పొగిడేస్తున్నారు.
ఇకపోతే 'బాహుబలి' రెండు పార్ట్‌లను ఎంత భారీతనంతో తెరకెక్కించారో… ఈ 'సాహో' సినిమాను కూడా అదే స్థాయిలో భారీగా చిత్రీకరిస్తున్నారు. క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. 'సాహో' ఫస్ట్‌లుక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. హాలీవుడ్ స్థాయి పనితీరు కనబర్చారంటూ చిత్ర యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కానీ కొందరు మాత్రం అప్పుడే విమర్శలు మొదలేట్టేశారు. హాలీవుడ్ మూవీని కాపీ కొట్టేశారని జోకులు పేలుస్తున్నారు.