సాయి పల్లవి మళ్ళీ మళయాళానికే వెళ్లిపోతుందా..?

Update: 2017-07-24 06:26 GMT

మలయాళం ప్రేమమ్ లో నటించి అందరి మనసులు కొల్లగొట్టేసిన సాయి పల్లవి ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో ఫిదా చిత్రం లో నటించింది. ఫిదా చిత్రం గత శుక్రవారమే విడుదలై బంపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అందులోని సాయి పల్లవి నటనలో 100 కి 200 మార్కులు పడిపోతున్నాయి. కుర్ర కారైతే సాయి పల్లవిలాంటి అమ్మాయి తమకి లైఫ్ పార్ట్నర్ లా రావాలనుకుంటున్నారు. సాయి పల్లవి అందం పక్కన పెట్టి ఆమె నటనకు ఫిదా అయిపోతున్నారు. తెలుగమ్మాయిలు కూడా తెలుగు మాట్లాడలేని ఈ రోజుల్లో మలయాళం నుండి వచ్చి తెలుగమ్మాయిగా అందరి గుండెల్లో గూడు కట్టేసింది సాయి పల్లవి.

ఇక ఫిదా సినిమా అంటే సాయి పల్లవి సాయి పల్లవి అంటే ఫిదా అనే లెవల్లో తెలుగు ప్రేక్షకులు ఫిదా కి కనెక్ట్ అయ్యారు. సాయి పల్లవి మాతృక మలయాళంలో అయితే ఫిదా సినిమా టాక్, ట్రయిలర్లు చూసి, మళయాల సినిమా రంగం జనాలు ఆ సినిమాను తమ భాషలోకి డబ్ చెయ్యమని కోరుతున్నారు. అయితే ఫిదా చిత్రాన్ని మలయాళంలో డబ్ చెయ్యాలంటే కొన్ని టెక్నికల్ ప్రొబ్లెమ్స్ ఏవో ఉండడం వలన వారి కోరికను హోల్డ్ లో పెట్టినట్లు చెబుతున్నారు. డబ్బింగ్ సినిమాలకు సెన్సార్ లకు సంబందించిన మార్పులేవో కొన్ని కేరళలో వచ్చినట్టు చెబుతున్నారు. అందుకే అవన్నీ పరిశీలించిన తర్వాతే ఫిదాని మలయాళంలో డబ్ చేస్తారట.

Similar News