శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రం అందరిని ఫిదా చెయ్యడమే కాదు కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికే ఫిదా చిత్రం 90 కోట్ల షేర్ వసూలు చేసి 100 కోట్లు కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తుంది. ఫిదా చిత్రం బిజినెస్ క్లోజ్ అయినప్పటికీ ఈ చిత్రం అటు ఇటు 100 కోట్ల మార్కును అందుకుంటుందంటున్నారు. అయితే ఈచిత్రం మొత్తం శేఖర్ కమ్ముల తన స్టయిల్లోనే తెరకెక్కించినప్పటికీ ఈసినిమాలో నటించిన సాయి పల్లవి అద్భుత నటన, మంచి డాన్స్ పెరఫార్మెన్సు తో ఇరగదీసింది. ఫిదా చిత్రంలో సాయి పల్లవి నటనకు కేవలం ఫిదా అవడమే కాదు కుర్రకారంతా అలాంటి అమ్మాయి తమ లైఫ్ లో కూడా ఉంటె ఎంత బావుంటుందో అని కలలు కనేసారు.
మరి సాయి పల్లవి ఫిదా చిత్రం హిట్ తో ఆమె క్రేజ్ ఆకాశాన్నంటింది. ఆ క్రేజ్ ని, స్టార్ స్టేటస్ ని సాయి పల్లవి ఒకేఒక్క హిట్ తో బాగానే అనుభవించి నట్లున్నారు. అలాగే సాయి పల్లవి వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోకుండా కేవలం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఎంసీఏ లో నాని కి జోడిగా నటిస్తుంది. అయితే మొదటి సినిమా హిట్ తో సాయి పల్లవికి కాస్త ఎక్కువైందని.... నాని ఎంసీఏ సినిమా షూటింగ్ కి సాయి పల్లవి లేట్ గా వస్తుందని... అలాగే నాని తో సాయి పల్లవికి చిన్న చిన్న విభేదాలు వచ్చాయనే టాక్ ఉంది. అయితే అవన్నీ ఒట్టి రూమర్స్ అని హీరో నాని తోపాటు దిల్ రాజు కూడా కొట్టి పారేసారు.
అయితే వారేమన్న కూడా సాయి పల్లవి ఇలాంటి రూమర్స్ తో విసిగిపోయి ఇక తెలుగులో సినిమాలు చెయ్యకూడదని నిర్ణయించుకుందని... అందుకే తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకోవడం లేదనే రూమర్ కూడా బయలుదేరింది. ఇక తెలుగులో సినిమాలు చెయ్యకుండా కేవలం తమిళ, మలయాళ సినిమాలు మాత్రమే చేయాలనీ డిసైడ్ అయినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. మరోపక్క మలయాళం, తమిళంలో తను హీరోయిన్ గా చేసే సినిమాలన్నీ ఇటు తెలుగులో కూడా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తుందట సాయి పల్లవి. ఇక ప్రస్తుతం సాయి పల్లవి తమిళంలో కారు, మారి 2 సినిమాలు చేస్తుంది. మరి నిజంగానే తెలుగు లో సాయి పల్లవి సినిమాలు చెయ్యదో లేదో అనేది రూమారా లేకుంటే నిజమేనా అనేది తెలియాల్సి ఉంది.