సాయి పల్లవి ఆ ఆఫర్ ఎందుకు వదులుకుంది?

Update: 2018-03-09 11:37 GMT

ప్రస్తుతం సాయి పల్లవి క్రేజ్ మాములుగా లేదు. ఆమె మేక్ అప్ లేకుండా చేసినా ఆమె సినిమాలని తెగ ఆదరిస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఆమె హీరోలతో గొడ‌వ‌లు ప‌డుతుందంటూ..వారిని ఇరిటేట్ చేస్తుందంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నా.. ఆమెతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. అదేవిధంగా ఆమెపై గాసిప్పులు కూడా అదే తరహాలో గుప్పుమంటున్నాయ్.

లేటెస్ట్ గా ఆమెకు రోజుకు 13 లక్షలు ఇస్తామ‌ని ఆఫ‌ర్ వ‌చ్చినా సాయి పల్లవి నో చెప్పిందని ఒక గాసిప్ ప్రచారం లో ఉంది. ఒక అమెరిక‌న్ సంస్థ కేవ‌లం అమెరికాలో ఒకే ఒక్క రోజు స్టే చేస్తే చాలు 13 లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇక్కడ నుండి బిజినెస్ క్లాస్ టికెట్స్.. టెన్ స్టార్ హోటల్ లో బస.. అంటూ ఆఫర్ చేశారని దానిని సాయి పల్లవి తిరస్కరించిందని చెబుతున్నారు.

అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. ఈ సంస్థ వారు హీరోయిన్స్ తో డిన్నర్ ప్లాన్ చేస్తారు. తద్వారా ఆ సంస్థలు వీరితో కలిసి భోజనం చేయాలి అనుకునేవారి దగ్గర నుండి టిక్కెట్ వసూలు చేస్తారు. అలా బోలెడంత చారిటీ డబ్బులు పోగేస్తారు. ఇలాంటి డిన్నర్ కు పిలిచేంత స్టార్డమ్ సాయి పల్లవికి ఉందా? చేసింది తక్కువ సినిమాలే. కానీ బయట మాత్రం ఫ్యాషన్ సెన్స్ లేకుండా అస్సలు ఏమాత్రం హీరోయిన్నే కాదు అన్నట్లు ఉంటుంది. అందుకే ఇలాంటి భామలకు అలాంటి డిన్నర్లకు రమ్మనేంత క్రేజ్ ఉండదు. కాబట్టి సాయి పల్లవి కి ఆ ఆఫర్ అనడం జస్ట్ న్యూస్ అనే అనుకోవాలి.

Similar News