సాయి డేట్ కి పిలిచింది ఎవరినో తెలుసా?

Update: 2017-11-29 16:00 GMT

సాయి ధరం తేజ్ ఒక మాదిరి హిట్స్ తో ఇండస్ట్రీలో మెగా హీరో కింద చలామణి అవుతున్నాడు. ఇప్పుడు కూడా లేటెస్ట్ మూవీ జవాన్ తో మంచి హిట్ అందుకోవడానికి శతవిధాలా కష్టపడ్డాడు. రైటర్ బివిఎస్ రవి డైరెక్ట్ చేసిన ఈ 'జవాన్' సినిమా డిసెంబర్ 1 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే ప్రస్తుతం సాయి ధరం తేజ్ 'జవాన్' మూవీ ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూస్ లో పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు. అంతేకాకుండా ఛానల్ యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అందరిని ఎంటర్టైన్ చేసాడు.

అయితే ఈ షో లో సాయి ధరమ్ తేజ్ ని ఎవరైనా అమ్మాయితో డేటింగ్ చేశారా అన్న ప్రశ్నకు సాయి సమాధానం ఇస్తూ 'ఇంతవరకు ఏ హీరోయిన్ కూడా నన్ను డేట్ కి పిలవలేదు. కాని నేనే ఓ హీరోయిన్ ని డేటింగ్ కి రమ్మని అడిగాను' అని బాంబ్ పేల్చాడు సాయి ధరం తేజ్. అయితే అందుకు ఆ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని అడిగి చెప్తాను అని చెప్పిందట . ఆ హీరోయిన్ మరెవరో కాదు సాయి ధరం తేజ్ తో కలిసి 'తిక్క' మూవీ లో నటించిన లారిస్సా బోనేసి. .

అవును నిజంగానే సాయి ధరమ్ తేజ్ ఈ హీరోయిన్ ని అప్పట్లో డేట్ కి రమ్మని అడిగాడట. అంతే ఆ తరువాత ఇక ఏ ఒక్క హీరోయిన్ ని కూడా డేట్ కి రమ్మని అడగలేదట సాయి. మరి మెగా హీరో చెప్పింది నిజమేనా? నమ్మొచ్చా?

Similar News