సవ్యసాచిలో మాధవన్?

Update: 2017-09-26 09:32 GMT

నాగ చైతన్య యుద్ధం శరణం చిత్రంతో దెబ్బతిన్నాడు. ఆ చిత్రం సెప్టెంబర్ 8 న విడుదలై సోదిలోకి లేకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫలితం ఎలా వున్నా ఇప్పుడు నాగ చైతన్య తన తర్వాతి సినిమాని చందు మొండేటి దర్శకత్వంలో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రం మొదలు పెట్టకముందే సవ్యసాచి అనే డిఫరెంట్ టైటిల్ తో అందరి దృష్టిని ఆకర్షించారు చైతు - చందు లు ఇద్దరు. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య గతంలో నటించిన ప్రేమమ్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక సవ్యసాచి మీద కూడా మంచి అంచనాలు ఏర్పడేలా చేశారు చైతు మరియు దర్శకుడు చందులు. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతుందని చెబుతున్నారు. అయితే సినిమా ఇలా లేట్ అవడానికి కారణం ఏమిటంటే సవ్యసాచిలో వెన్నెల కిషోర్ ని కామెడియన్ గా సెలెక్ట్ చెయ్యడం... వెన్నెల సినిమా మొత్తం కనబడనుండంతో... సినిమా స్టార్టింగ్ నుండి వెన్నల కిశోర్ చిత్ర బృందానికి అందుబాటులో ఉండాల్సి వుంటుందట. కానీ వెన్నెల కిషోర్ మాత్రం అనూహ్యంగా బాగా బిజీ అవడంతో నాగ చైతన్య సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చెయ్క్యలేక తికమక పడడంతోనే ఈ సినిమా సెట్స్ మీదకెళ్ళకుండా ఆగిందంటున్నారు.

ఇక ఈ సవ్యసాచి గురించిన మరొక ఆసక్తికర విషయం ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే నాగ చైతన్య నటించబోయే సవ్యసాచి చిత్రంలో మరో తమిళ హీరో నటించబోతున్నాడట. తమిళ హీరో మాధవన్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే దర్శకుడు చందు మొండేటి మాధవన్ ని కలిసి సవ్యసాచి స్క్రిప్ట్ వినిపించినట్లుగా... కథ నచ్చిన మాధవన్ ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రం మొత్తం అలైన్ హ్యాండ్ సిండ్రోమ్ అనే లక్షణం కలిగిన కథానాయకుడి పాత్ర చుట్టూ నడిచే కథగా ఉంటుందని సమాచారం. అయితే ఈ చిత్రం లో మాధవన్ నటిస్తున్నాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News