సల్మాన్ ఆవేశంగా దూసుకొస్తున్నాడు!

Update: 2017-10-19 10:00 GMT

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా గతంలో తెరకెక్కిన ‘ఎక్‌ థా టైగర్‌’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం 'టైగర్‌ జిందా హై’. అప్పట్లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘ఎక్‌ థా టైగర్‌’ చిత్రం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు తాజాగా అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టైగర్‌ జిందా హై’ చిత్రంలో మాజీ ప్రేమ జంట సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్ లు జంటగా నటిస్తున్నారు. ట్యూబ్ లైట్ తో భారీగా బెబ్బతిన్న సల్మాన్ ఖాన్ ఈ చిత్రంపై భారీ ఆశలుపెట్టుకున్నాడు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈ దీపావళి కానుకగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ‘టైగర్‌ జిందా హై’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో 'దెబ్బతగిలిన పులిలా ఎవ్వరూ వేటాడలేరు' అన్న డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది.

ఇక ఈ ఫస్ట్ లుక్ లో సల్మాన్ ఖాన్ సగం మొహాన్ని మిషన్ గన్ కప్పేస్తుండగా... మిగతా సగం మొహం ఎంతో ఆవేశంతో, ఆక్రోశమైన చూపుతో సల్మాన్ భలేగా కనిపిస్తున్నాడు. చేతిలో మిషన్ గాన్ తో సల్మాన్ ఖాన్ అందంగానూ... ఆవేశంతోనూ కనబడుతున్నాడు. మరి ఈ సినిమాతో మరోసారి సల్మాన్ ఖాన్ కోట్లు కొల్లగొట్టేలాగే కనబడుతున్నాడు. ఇక ఈ ఫస్ట్ లుక్ తోపాటు 'టైగర్‌ జిందా హై’ చిత్రానికి విడుదల తేదీని కూడా రివీల్ చేసింది చిత్ర బృందం. డిసెంబర్ 22 న 'టైగర్‌ జిందా హై’ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది.

Similar News